How to stop snoring permanently : గురక సమస్య చాలామందిని వేధించే సమస్య.. గురకపెట్టే సంగతి నిద్రలో ఉన్నవారి తెలియదు. నిద్రించే సమయంలో శరీరమంతా పూర్తిగా విశ్రాంతి దశలోకి చేరుకుంటుంది. గురక పెట్టేవారితో పక్కనే నిద్రపోయే వారికి రాత్రిపూట అమ్మో నరకమే అన్నట్టుగా అనిపిస్తుంటుంది.
గురక శబ్దానికి రాత్రిళ్లూ నిద్రపట్టక ఇబ్బంది పడిపోతుంటారు. ఎప్పుడు తెల్లారుతుందా? అని నిద్రలేని రాత్రుళ్లూ గడిపేస్తుంటారు. అయితే నిద్రలో గురక సమస్యతో బాధపడేవారి కోసం ఓ సింపుల్ రెమడీ అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు పరిశోధకులు. గురక సమస్యకు రెండే రెండు మాత్రలు వాడితే శాశ్వతంగా వదిలించుకోవచ్చునని అంటున్నారు.
స్థూలకాయుల్లో గురక సమస్య సర్వ సాధారణం. స్లీప్ అప్నియా (Sleep Apnea) అనే రుగ్మత శ్వాసకు అంతరాయం కలిగిస్తుంది. ఒక వ్యక్తి నిద్రపోతున్న సమయంలో వాయుమార్గంలోని కండరాలు సహజంగా విశ్రాంతి పొందుతాయి.
కాన్నీ, స్లీప్ అప్నియాతో బాధపడుతున్న వ్యక్తిలో మాత్రం ఈ కండరాలు పూర్తిగా మూసుకుపోతాయి. ఫలితంగా.. గొంతులోని చిన్న గ్యాప్ నుంచి గాలి బయటకు వస్తుంటుంది. అది గురకకు దారితీస్తుంది. ఇది శ్వాసకు అంతరాయం కలిగిస్తుంది.
2018లో, అమెరికాలోని బోస్టన్లోని బ్రిగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు 20 మంది గురక సమస్యతో బాధపడేవారిపై ఒక అధ్యయనం నిర్వహించారు. వారికి రెండు రకాల డ్రగ్స్ ఇచ్చారు. గురక సమస్య ఉన్న వారిలో మెరుగుదల చూపించింది.
రెండు రకాల ఔషధాలలో ఒకటి Atomoxetine. 20 ఏళ్లుగా ఈ డ్రగ్ వాడుకలో ఉంది. సాధారణంగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)తో బాధపడుతున్న పిల్లలకు ఈ డ్రగ్ ఇస్తుంటారు.
మరో డ్రగ్ Oxybutynin. ఈ మాత్ర యూరిన్ ఆపుకొనలేని రోగులకు ఇస్తారు. మూత్రాశయాన్ని నియంత్రించే కండరాలలోని దుస్సంకోచాలను తగ్గిస్తుంది. ఈ రెండు మందులను కండరాలను నియంత్రించడంపై పనిచేస్తాయి.
అందుకే అధ్యయనంలో పాల్గొనే వారికి ఈ రెండింటి కలయికతో డ్రగ్ ఇచ్చారు పరిశోధకులు.. గురకతో బాధపడేవారిలో సమస్య శాశ్వతంగా తగ్గిపోయినట్టుగా నిర్ధారించారు.
అందుకే.. ప్రస్తుతం AD109గా కోడ్-పేరుతో కొత్త ఔషధం ఈ రెండింటి కలయికగా చెబుతుంటారు. ఒక అమెరికా సంస్థ ఈ ఔషధాన్ని తయారు చేస్తోంది. క్లినికల్ ట్రయల్ ఏర్పాటు చేస్తోంది.
ఏదేమైనా.. ఈ రెండు ఔషధాల్లోనూ అనేక సైడ్ ఎఫ్టెక్టులు ఉన్నాయని అంటున్నారు. ఈ డ్రగ్స్‌పై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు.
0 comments:
Post a comment