Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 15 November 2020

SBI PO recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

 

బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అతిపెద్ద శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2000 ఖాళీలను ప్రకటించింది. మొత్తం 2000 ఖాళీల్లో 200 పోస్టుల్ని ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్‌కి కేటాయించింది ఎస్‌బీఐ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ 31, జనవరి 2, 4, 5 తేదీల్లో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అయ్యే సమయంలో రూ.2 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి.

బాండ్ ప్రకారం అభ్యర్థులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 2000

ఎస్సీ- 300

ఎస్టీ- 150

ఓబీసీ- 540

ఎకనమికల్లీ వీకర్ సెక్షన్- 200జనరల్- 810

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2020 నవంబర్ 14

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ- 2020 డిసెంబర్ 4

దరఖాస్తు ఫీజు చెల్లింపు- 2020 నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4

ప్రిలిమినరీ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్- 2020 డిసెంబర్ మూడోవారం

ఫేజ్ 1 ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్- 2020 డిసెంబర్ 31, 2021 జనవరి 2, 4, 5

ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల- 2021 జనవరి మూడో వారం

మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 జనవరి మూడో వారం

ఫేజ్ 2 ఆన్‌లైన్ మెయిన్ ఎఘ్జామ్- 2021 జనవరి 29

మెయిన్ ఫలితాల విడుదల- 2021 ఫిబ్రవరి మూడోవారం లేదా నాలుగో వారం

ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 ఫిబ్రవరి మూడోవారం లేదా నాలుగో వారం

ఫేజ్ 3 ఇంటర్వ్యూ లేదా గ్రూప్ ఎక్సర్‌సైజెస్- 2021 ఫిబ్రవరి లేదా మార్చి

తుది ఫలితాల విడుదల- 2021 మార్చి చివరి వారం

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీ అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2020 డిసెంబర్ రెండోవారం

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2020 డిసెంబర్ మూడోవారం లేదా నాలుగో వారం

విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. 2020 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాస్ కావాలి.

వయస్సు- 2020 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top