SBI Alert Message: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్... ఈ 5 తప్పులు చేయొద్దంటున్న బ్యాంకు...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. కస్టమర్లకు ఎస్బీఐ ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ రోజులతో పోలిస్తే ఫెస్టివల్ సీజన్లో లావాదేవీలు ఎక్కువగా జరుపుతుంటారు ప్రజలు. ఈ రోజుల్లో షాపింగ్ నుంచి ఇతర పేమెంట్స్ వరకు కార్డులను, డిజిటల్ పేమెంట్ పద్ధతుల్ని ఉపయోగిస్తారు కస్టమర్లు. పండుగ సమయంలో ఎక్కువగా జరిగే లావాదేవీలను దృష్టిలో పెట్టుకొని తమ కస్టమర్లను ఎస్బీఐ హెచ్చరిస్తోంది. ఎలాంటి మోసాలు జరుగుతాయో, కస్టమర్లు ఏ విధంగా మోసపోయే అవకాశం ఉంటుందో గుర్తించి ఎస్బీఐ అప్రమత్తం చేస్తోంది. మోసపోకుండా తమ అకౌంట్లను ఎలా జాగ్రత్తగా సూచిస్తోంది. ప్రధానంగా 5 తప్పులు చేయకూడదని హెచ్చరిస్తోంది. ఆ 5 తప్పులు ఏవో తెలుసుకోండి.
1. మీ ఫోన్కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్-OTP, పిన్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ నెంబర్, ఆ కార్డుల వెనుక ఉండే సీవీవీ నెంబర్స్ ఎవరికీ చెప్పకూడదు. చాలావరకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఈ వివరాలు అడుగుతుంటారు. ఎవరైనా మీకు కాల్ చేసి ఈ వివరాలు అడిగినట్టైతే అస్సలు చెప్పకూడదు. Aadhaar Card: అలర్ట్... ఆధార్ కార్డు చెల్లదని మీకు మెసేజ్ వచ్చిందా?
2. ఫోన్లో బ్యాంకు అకౌంట్ వివరాలు సేవ్ చేయకూడదు. ఫోన్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అకౌంట్ వివరాలు చూడొచ్చని సేవ్ చేయడం చాలామందికి అలవాటు. ఆ అలవాటే చివరకు కొంప ముంచుతుంది. అందుకే ఫోన్లో బ్యాంకు అకౌంట్ నెంబర్లు, కార్డు నెంబర్లు, పాస్వర్డ్స్ లాంటివి సేవ్ చేయకూడదు. అకౌంట్ వివరాలు కనిపించే ఫోటోలు కూడా తీయకూడదు.
3. ఏటీఎం కార్డు వివరాలు ఎవరికీ వెల్లడించొద్దు. మీ ఏటీఎం కార్డు మీరే ఉపయోగించాలి. కార్డు ఎవరికీ ఇవ్వకూడదు. కార్డు వివరాలు కూడా ఎవరికీ చెప్పకూడదు. దీని వల్ల బ్యాంక్ అకౌంట్ వివరాలు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది.
4. మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్టైతే మీ సొంత వైఫై మాత్రమే ఉపయోగించాలి. లేదా మొబైల్ డేటా ఉపయోగించాలి. అంతే తప్ప పబ్లిక్ ఇంటర్నెట్ ఉపయోగించకూడదు. ఎక్కడో వైఫై ఫ్రీగా వస్తోందని లావాదేవీలు జరిపితే మీ బ్యాంకు వివరాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
5. మీ యూజర్ ఐడీ, పిన్, పాస్వర్డ్, సీవీవీ, ఓటీపీ, వీపీఏ, యూపీఐ లాంటి వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI సిబ్బంది, ఇతర బ్యాంకు సిబ్బంది ఎవరూ అడగరు. ఎవరైనా ఈ వివరాలు అడుగుతున్నట్టైతే మిమ్మల్ని మోసం చేయడానికేనని గుర్తించండి.
0 comments:
Post a comment