Reorganization of the EHS Committee of Employees.
ఉద్యోగుల ఈహెచ్ఎస్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.
🍁అమరావతి, ఆంధ్రప్రభ:
🔰ఉద్యోగుల హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
🔰ఇందుకు సంబంధించి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
🔰ఆర్థికశాఖ కార్యదర్శి ధైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీ లో సభ్యులుగా ట్రెజరీస్ డైరెక్టర్, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు, ఏపీ స్టేట్ టీచర్స్ యూనియన్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీయునైటెడ్ టీచర్స్ అసోసియేషన్, రిటైర్ గవర్న మెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్, టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షునితో పాటు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులను నియమించింది.
🔰ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈహెచ్ ఎస్ అమల్లో ఆర్ధికపరమైన అంశాలను కమిటీ పర్యవేక్షిస్తుంది.
0 comments:
Post a comment