Mushrooms in Meghalaya: మన దేశంలో దట్టమైన అడవులు చాలా చోట్ల ఉన్నాయి. వాటిలో... ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు అత్యంత దట్టంగా ఉంటాయి. అందుకు తగ్గట్టే అక్కడ రకరకాల చెట్లు, మొక్కలు కనిపిస్తాయి. పూలు, కాయలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇలా... మిగతా రాష్ట్రాల్లో కనిపించనివి చాలా అక్కడ కనిపిస్తాయి. తాజాగా సైంటిస్టులు అక్కడ సరికొత్త పుట్టగొడుగుల్ని (Mushrooms) చూశారు. స్థానికుల ద్వారా వాటిని కనిపెట్టారు. వాటిని ఫొటోలు తీసి ప్రపంచానికి చూపించారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అవి మనం తరచూ వండుకునే తరహా పుట్టగొడుగులు కాదు. మన పొలాల్లో తాటిచెట్లకు అంటుకొని పెరిగే రకాలు కూడా కాదు. అవి మెరిసే పుట్టగొడుగులు (bioluminescent).
అంటే అవి కాంతిని వెదజల్లుతాయి. మన ఇంట్లో రాత్రి వేళ బెడ్ బల్బు మాత్రమే వెలిగితే... అది ఎలా కాంతిని ఇస్తుందో... అలా ఆ పుట్టగొడగులు కూడా కాంతిని ఇస్తున్నాయి.
ఈ జాతి పుట్టగొడుగులను రోరిడోమిసెస్ హిల్లోస్టాఖిడిస్ (Roridomyces hyllostachydis) అని పిలుస్తారు. వీటిని తొలిసారిగా ఆగస్టులో మేఘాలయ... ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలోని... మాలిన్నాంగ్లో... ఓ కాలువ పక్కన చూశారు. తర్వాత ఇవి వెస్ట్ జైన్షియా హిల్స్ జిల్లాలోని... క్రాంగ్ షురీలో కనిపించాయి. ఇప్పటివరకూ ఇలా మెరిసే పుట్టగొడుగుల జాతులు ఈ ప్రపంచంలో 96 ఉన్నాయి. ఈ కొత్త జాతి చేరికతో ఇవి 97 రకాలయ్యాయి.
మేఘాలయలో వింత పుట్టగొడుగులు... (Image credit - instagram)
మేఘాలయ స్థానికులు తాము ఎలక్ట్రిక్ పుట్టగొడుగుల్ని చూశామనీ... రాత్రి వేళ అవి కాంతి ఇస్తున్నాయని చెప్పగా... విషయం ఆనోటా ఈనోటా చేరి... చివరకు సైంటిస్టులకు తెలిసింది. అంతే వెంటనే ఓ టీమ్ అక్కడకు వెళ్లింది. ఆ టీమ్‌ని ఓ స్థానిక వ్యక్తి... వెదురుబొంగు చెట్ల అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ పెద్దగా ఎండ లేదు. చీకటిగా కూడా ఉంది. మీ చేతిలో టార్చ్ లైట్లను ఆర్పేయండి అని అతను కోరాడు. సైంటిస్టుల టీమ్ టార్చిలైట్లను ఆర్పేసింది. అంతే... అవతార్ సినిమాలో లాగా... మెరుస్తూ... కాంతిని వెదజల్లుతూ... పుట్టగొడుగులు కనిపించాయి. వాటిని చూసి సైంటిస్టులు "వావ్... వాటే వండ్రఫుల్ మష్రూమ్స్" అని ఆశ్చర్యపోయారు.
పడివున్న వెదురు బొంగుల నుంచి ఈ పుట్టగొడుగులు పుట్టాయి. ఇవి గ్రీన్ కలర్లో మెరుస్తున్నాయి. వీటి నుంచి వచ్చే కాంతి కూడా గ్రీన్ కలర్ లోనే ఉంది.
సాధారణంగా సముద్రాల్లో ఇలాంటి మెరుపులు మెరిపించే జీవులుంటాయి. భూమిపైనా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. మీరు ఫైర్ ఫ్లై (Firefly) చూశే ఉంటారు. చీకట్లో కాంతిని వెదజల్లుతూ ఎగురుతుంటాయి. ఇవీ అలాంటివే. కొన్ని రకాల రసాయనాల వల్ల ఇలా కాంతిని వెదజల్లగలవు. పుట్టగొడుగులు అనేవి ఒక రకమైన ఫంగస్. వీటిలో ల్యూసిఫెరాస్ (luciferase) అనే ఎంజైమ్ ఉంటే మెరుపులు మెరిపించగలవు. ఈ ల్యూసిఫెరాస్, ఆక్సిజన్ కలిసినప్పుడు... రసాయనిక చర్య జరిగి... కాంతి వస్తుంది. ఈ కాంతి ప్రక్రియ రోజంతా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే... రాత్రిళ్లు మాత్రమే... వాటి కాంతి కనిపిస్తుంది.
0 comments:
Post a comment