TOP MOST IMPORTANT
అందరూ ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారులకు జీవీకే కిట్ల పంపిణీ పై సూచనలు.
1) జీవీకే కిట్ల పంపిణీ బయోమెట్రిక్ authentication 100% పూర్తి చేయవలసి ఉన్నది, కానీ చాలా మండలాల్లో 80 శాతం కన్నా తక్కువ పూర్తిచేసి ఉన్నారు. ఆ మండలాలపై SPD గారు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా మండలాల మండల విద్యాశాఖ అధికారులు MIS, CO, CRPs లు ప్రధానోపాధ్యాయులకు ఈరోజు 100% authentication పూర్తిచేయాలని సూచించాలి.
2) ఒకటో తరగతి లో చేరిన వారి వివరాలు JVK app లో కనబడకపోతే వారి తల్లి లేదా GUARDIAN యొక్క వివరాలను అప్డేట్ చేస్తే వారి పేర్లు JVK లో రిఫ్లెక్ట్ అవుతాయి. దీనికొరకు S3 ఆప్షన్లు ఉపయోగించాలి. అప్పుడు వారి పేర్లు JVK లో రిఫ్లెక్ట్ అవుతాయి.
3) అదేవిధంగా ఆరో తరగతి లో చేరిన పిల్లల వివరాలు JVK లో REFLECT కాకపోతే వారు ముందు సంవత్సరం ఏ పాఠశాలలో చదివేరో ఆ పాఠశాలలో బయోమెట్రిక్ ఇచ్చి KIT మాత్రం కొత్త పాఠశాలలో తీసుకున్నట్టుగా ఏర్పాట్లు చేయాలి.
ఒకవేళ ఆరో తరగతి విద్యార్థులకు పూర్వ పాఠశాలలో అంటే ఐదో తరగతి చదివిన పాఠశాలలో KIT ఇచ్చిన్నట్లయితే వారికి అదే పాఠశాలలో AUTHENTICATION వెయ్యాలి .ఈ విధంగా చేయడం వల్ల 100% తొందరగా అయ్యే అవకాశం ఉంది.
4)అదేవిధంగా న్యూ జాయినింగ్ ఏమైనా ఉన్నట్లయితే వారికి కూడా CSE లో నమోదు చేసిన తర్వాత S3 కి వెళ్లి అక్కడ మదర్ లేదా GUARDIAN యొక్క వివరాలు అప్డేట్ చేయడం వల్ల వారి పేర్లు రిఫ్లెక్ట్ అవుతాయి.
5) ఏజెన్సీ మండలాల వారు మరియు సిగ్నల్ లేని పాఠశాల ఉపాధ్యాయులు ఆన్లైన్ సౌకర్యం లేదని తెలియజేస్తున్నారు. వారిని ఆ ప్రాంతము లో ఏ నెట్వర్క్ పని చేస్తే ఆ SIM వాడి మొబైల్ లో HOTSPOT ఇచ్చి WiFi ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని సూచించారు.
6) SPD గారు తల్లుల అకౌంట్ లో కుట్టు కూలీ డబ్బులు వేస్తున్నారు. బయోమెట్రిక్ AUTHENTICATION పూర్తి కానీ తల్లుల అకౌంట్ లో కుట్టు కూలీ జమ కాదు. అట్టి వారికి కుట్టు కూలీ ప్రధానోపాధ్యాయులు మరియు MEO లు బాధ్యత వహించవలసి వస్తుంది కావున 100% authentication అయ్యేలా చూడాలి.
DEO & APC SS Prakasam
0 comments:
Post a comment