18 నెలల్లో రూ.1000 కోట్లు సంపాదన.. ఎలా సాధ్యమైందంటే..?
ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ కావాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎంత కష్టపడినా కొందరు జీవితంలో సక్సెస్ కాలేరు. మరి కొంతమంది మాత్రం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నం చేసి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటూ ఉంటారు. అలా జీవితంలో ఎంతో శ్రమించి లక్ష్యాన్ని సాధించిన వ్యక్తే కరణ్ బజాజ్. 18 నెలల్లో 1000 కోట్ల రూపాయలు సంపాదించిన కరణ్ బజాజ్ జీవితంలో ఊహించని స్థాయిలో కష్టాలు, సుఖాలు రెండూ ఉన్నాయి.
కరణ్ బజాజ్ తండ్రి ఆర్మీ ఆఫీసర్. బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన కరణ్ బజాజ్ బెంగళూరు ఐఐఎంలో సీటు సాధించారు. అక్కడ ఎంబీఏ చదివి ఏరియల్ వాషింగ్ పౌడర్ బ్రాండ్ మేనేజర్ గా అమెరికాకు వెళ్లారు. ఆ తరువాత చిన్నప్పటి నుంచి రచయిత కావాలని ఉన్న కలను కరణ్ నెరవేర్చుకున్నారు.
అయితే జీవితంలో ఊహించని విజయాలను అందుకుంటున్న సమయంలో అమ్మ చనిపోవడంతో కరణ్ లైఫ్ మారిపోయింది.
ఆ తరువాత సన్యాసిగా మారిన కరణ్ అమెరికాకు వెళ్లి కెరీని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత వైట్ హ్యాట్ జూనియర్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా పిల్లలకు కంప్యూటర్ కోడింగ్ ను ఒక ఆటలా నేర్పించాడు. మహిళలను మాత్రమే టీచర్లుగా తీసుకుని వాళ్లతో అద్భుతాలు చేయించాడు. కరణ్ ఏ విశ్వాసంతో సంస్థను స్థాపించాడో ఆ విశ్వాసం చివరకు నిజమైంది.
2018 సంవత్సరం అక్టోబర్ నెలలో పదిమంది ఉద్యోగులతో ప్రారంభమైన ఆ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 400కు పెరిగింది. రోజూవారీ క్లాసులు వినే విద్యార్థుల సంఖ్య 25000కు పెరిగింది. ఆ తరువాత బైజూస్ సంస్థకు 2,200 కోట్ల రూపాయలకు సంస్థను అమ్మేశానని 1,000 కోట్ల రూపాయల లాభం తనకు వచ్చిందని కరణ్ చెబుతున్నాడు.
0 comments:
Post a comment