కరోనా మహమ్మారి రాకతో ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఎంతో మంది ప్రాణాలను బలిగొంటూనే, మరెంతో మంది బతుకులను ఆస్పటల్లో వేసేస్తుంది. ఈ కరోనా భారీ నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకుంది. మొదటగా అమలు చేసినది లాక్ డౌన్.. ఈ లాక్ డౌన్ మూలంగా ఎంత మందికి కరోనా రాకుండా అడ్డుకున్నామన్నది పక్కన పెడితే కరోనా పుణ్యమా అని ఎంతో మంది రోడ్డున పడ్డారు. మరెంతో మంచి ఆకలి చావులను చవిచూసారు. ఉన్న ఉద్యోగాలు కోల్పోయి ఎటు వెళ్లాలో దిక్కుతోచని జనాలు ఎంతో మంది ఉన్నారు.
పట్టణాల్లోకి వలసలు వచ్చి పొట్ట కోసం పనులు చేస్తున్న వారి పరిస్థితి మాటల్లో చెప్పలేనిది. పొట్ట చేతిన పట్టుకుని సొంతూరు వెళ్లిన వారు చాలా మందే ఉన్నారు.
కాగా చాలా మంది సొంతూళ్లకు వెళ్లి వ్యవసాయమో లేక వ్యసాయాదారిత పనులు లేక ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కష్టాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదని వీళ్లను చూస్తుంటూనే అర్థమవుతోంది. ప్రైవేట్ ఉద్యోగుస్తుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. ఏ పేపర్లో చూసినా తెలుస్తుంది వారి బతుకు పోరును ఏ విధంగా ముందుకు నెడుతున్నారనేది.
కూరగాయలు అమ్ముతున్నాడనో, ఆన్లైన్ షాపింగ్ లో సెల్లర్ గా వర్క్ చేస్తున్నామనో, లేక వ్యవసాయం చేస్తున్నామనో లేక టీ, టిఫిన్ సెంటర్లు పెట్టుకుని బతుకుతున్నామనో వారి గురించి వార్తలు ప్రతినిత్యం చూస్తూనే ఉన్నం. అలాంటిదే లాక్ డౌన్ సమయంలో మెట్రోలో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి చేస్తున్న పని చూస్తే అందరూ మెచ్చుకోక తప్పదు. ఉత్తరాఖండ్ లోని అల్మోడా జిల్లా, నౌవాడా గ్రామానికి చెందిన దాన్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీ మెట్రో లో పనిచేసేవాడు. లాక్ డౌన్ మూలంగా అతను ఆ ఉద్యోగం కోల్పోయాడు. దాంతో అతను వేరే వాటిలో ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తన గ్రామంలో దాన్ సింగ్ హెర్బల్ టీ తయారు చేసి అమ్మకం మొదలు పెట్టాడు.
అతితక్కువ కాలంలోనే హెర్బల్ టీ కి మంచి డిమాండ్ పెరిగింది. ఇంకేముంది అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుని తన వ్యాపారాన్ని పెంచుకుని ప్రతి నెలా లక్ష రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఈ సందర్భంగా దాన్ సింగ్ మాట్లాడారు.. మా ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన గడ్డిని తలనొప్పులు, జ్వరాలు, జలుబు మొదలైన అనారోగ్య సమస్యల విరుగుడు కోసం వాడతారు. వాటిని నేను ఉపయోగించుకుని నలుగురికి ఉపయోగపడేలా ఆ గడ్డితోనే హెర్బల్ టీ ని తయారు చేయడం మొదలు పెట్టానని అతను తెలిపారు. అలాగే మా ఊరిలో దీనికి మంచి డిమాండ్ ఏర్పడిందని అతను తెలిపారు. ఈ వ్యాపారం మెట్రోలో పని చేసేకంటే ఇదే బాగుందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు దాన్ సింగ్.
0 comments:
Post a comment