Infosys Jobs: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలకు APSSDC జాబ్ నోటీస్... అర్హతలు ఇవే
డిప్లొమా విద్యార్థులకు శుభవార్త. మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. 2020-21 డిప్లొమా బ్యాచ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC ట్విట్టర్లో వెల్లడించింది. డిప్లొమా ఫ్రెషర్స్‌కి మాత్రమే క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ 2020-21 నిర్వహిస్తోంది ఇన్ఫోసిస్. ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల వివరాలను వెల్లడించలేదు. అభ్యర్థులు 2020 నవంబర్ 21 లోగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్ తర్వాత అభ్యర్థులకు 2020 డిసెంబర్ 9 నుంచి 13 మధ్య ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు లింక్ APSSDC అధికారిక వెబ్సైట్ https://www.apssdc.in/ లో ఉంది. మరిన్ని వివరాలను ఈ వెబ్సైట్లో చూడొచ్చు. విజయవంతంగా రిజిస్టర్ చేసిన అభ్యర్థులకు APSSDC నుంచి ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇన్ఫోసిస్ ఆన్లైన్ టెస్ట్‌కు ప్రిపేర్ కావడానికి ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. 2020 నవంబర్ 24 నుంచి 2020 డిసెంబర్ 8 మధ్య ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది.
భర్తీ చేసే పోస్టులు- ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 21
ఆన్లైన్ టెస్ట్- 2020 డిసెంబర్ 7 నుంచి 13విద్యార్హత- 2020-21 బ్యాచ్ డిప్లొమా విద్యార్థులు దరఖాస్తు చేయాలి. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్‌లో డిప్లొమా చదువుతున్నవారు అప్లై చేయాలి. యాక్టీవ్ బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. ఎస్ఎస్సీలో, డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. గత 6 నెలల్లో ఇన్ఫోసిస్ లిమిటెడ్ లేదా ఇన్ఫోసిస్ గ్రూప్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో పాల్గొని ఉండకూడదు.
వేతనం- ఏడాదికి రూ.2.2 లక్షలు
ఇతర బెనిఫిట్స్- రూ.4 లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్. రూ.30 లక్షల లైఫ్ కవర్.
ఎంపిక విధానం- ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ. ఆన్లైన్ టెస్ట్‌లో రీజనింగ్, టెక్నికల్, యెర్బా, న్యూమరికల్ పజిల్ ఎబిలిటీ లాంటి టాపిక్స్ ఉంటాయి.
ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC అధికారిక వెబ్సైట్ https://www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ వెబ్సైట్లో జాబ్స్ సెర్చ్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయాలి.
0 comments:
Post a comment