ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి 647 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇప్పటికే రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 8424 పోస్టులకు, 3517 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఖాళీలు ఉన్నాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తుంది ఐబీపీఎస్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 23 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు- 647
ఐటీ ఆఫీసర్- 20
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్- 485రాజ్‌భాషా అధికారి- 25
లా ఆఫీసర్- 50
మార్కెటింగ్ ఆఫీసర్- 60
హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్- 7
నోటిఫికేషన్ విడుదల- 2020 నవంబర్ 1
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2020 నవంబర్ 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 23
దరఖాస్తు ఫీజు చెల్లింపు- 2020 నవంబర్ 2 నుంచి నవంబర్ 23
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్- 2020 డిసెంబర్
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2020 డిసెంబర్ 26, 27
ప్రిలిమ్స్ ఫలితాల విడుదల- 2021 జనవరి
మెయిన్స్ అడ్మిట్ కార్డుల డౌన్లోడ్- 2021 జనవరి
మెయిన్స్ ఎగ్జామినేషన్- 2021 జనవరి 24
మెయిన్స్ ఫలితాల విడుదల- 2021 ఫిబ్రవరి
ఇంటర్వ్యూలకు అడ్మిట్ కార్డుల డౌన్లోడ్- 2021 ఫిబ్రవరి
ఇంటర్వ్యూల నిర్వహణ- 2021 ఫిబ్రవరి
ప్రొవిజనల్ అలాట్మెంట్- 2021 ఏప్రిల్
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.
ఫీజు- ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.175, ఇతర అభ్యర్థులకు రూ.850.
వయస్సు- 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లు.
ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.
0 comments:
Post a comment