Dress Code To Sachivalayam Staff: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థలో పలు మార్పులు చేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే ఇకపై సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందికి డ్రెస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటిగా ఒకటి లేదా రెండు జిల్లాల్లోని రెండు సచివాలయాలను ఎంపిక చేసి.. అక్కడ పని చేస్తున్న సిబ్బందికి డ్రెస్ కోడ్ అమలు చేయనుంది.
ఆ సచివాలయాల పరిధిలోని ప్రజలు, సిబ్బంది నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పురుష ఉద్యోగులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్ కలర్ ప్యాంట్, మహిళా ఉద్యోగులకు స్కై› బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగిన్‌ను డ్రస్ కోడ్‌గా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
కాగా, సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయింది. ప్రభుత్వ పధకాలను ప్రజలకు నేరుగా చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సచివాలయ సిబ్బందిగా పెద్ద సంఖ్యలో యువతను నియమించింది. ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 179 వార్డు సచివాలయాలు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 884 గ్రామ సచివాలయాలున్నాయి. వీటిల్లో సుమారు 8535 మంది సిబ్బంది పని చేస్తున్నారు.
0 comments:
Post a comment