డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. కేరళలోని కొచ్చిలో డీఆర్డీఓకు చెందిన నావల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రఫిక్ ల్యాబరేటరీ ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఇవి రెండేళ్ల ఫెలోషిప్ పోస్టులు. ఎంపికైన వారికి రూ.31,000, హెస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://drdo.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని ఫామ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి అప్లికేషన్ ఫామ్‌ను hrd@npol.drdo.in మెయిల్ ఐడీకి పంపాలి. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 2 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు- 6
ఎంపిక చేసే విభాగాలు- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫోటోనిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, రబ్బర్ టెక్నాలజీ, పాలిమర్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఓషియనోగ్రఫీ, ఓషియన్ టెక్నాలజీ, మెటరాలజీ, ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 2ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ
వేతనం- రూ.31,000 + హౌజ్ రెంట్ అలవెన్స్
విద్యార్హతలు- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫోటోనిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రబ్బర్ టెక్నాలజీ, పాలిమర్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఓషియనోగ్రఫీ, ఓషియన్ టెక్నాలజీ, మెటరాలజీ, ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ బ్రాంచ్‌లల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ పాస్ కావాలి. ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ అభ్యర్థులు నెట్ క్వాలిఫై కావాలి.
వయస్సు- 28 ఏళ్ల లోపు.
0 comments:
Post a comment