దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారులు, ఉన్నత చదువులు చదివే విద్యార్థులు క్రెడిట్ కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డును వినియోగించే వాళ్లు సరైన సమయంలో బిల్లు చెల్లిస్తే మంచిది. ఏదైనా కారణాల వల్ల సరైన సమయంలో బిల్లు చెల్లించడం సాధ్యం కాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
క్రెడిట్ కార్డుల వల్ల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, ఇన్స్టంట్ క్రెడిట్, నో కాస్ట్ ఈఎంఐ, రివార్డ్ పాయింట్లు లాంటి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. క్రెడిట్ కార్డ్ ను ఏ విధంగా వినియోగించుకున్నా బిల్లు సక్రమంగా చెల్లించేలా చూసుకోవాలి.
లేకపోతే క్రెడిట్ స్కోర్ పై ఆ ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటే భవిష్యత్తులో రుణాలను పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
కొన్ని సందర్భాల్లో అన్ని అర్హతలు ఉన్నా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందనే కారణంతో బ్యాంకులు రుణాలను మంజూరు చేయవు. బ్యాంకులు ఆలస్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించే వాళ్ల నుంచి ఆలస్య రుసుమును వసూలు చేస్తుండటంతో క్రెడిట్ కార్డ్ బిల్లు లేట్ గా చెల్లిస్తే నగదు భారం పడే అవకాశం ఉంది. ఆలస్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తే అధిక వడ్డీ భారం కూడా పడుతుంది.
సరిగ్గా బిల్లులు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. బిల్లు చెల్లించకపోవడం వల్ల కార్డు బ్లాక్ అయితే క్రెడిట్ స్కోర్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. సరిగ్గా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించని వాళ్లకు రివార్డు పాయింట్లు కూడా తగ్గుతాయి. అందువల్ల క్రెడిట్ కార్డ్ తీసుకుంటే సక్రమంగా బిల్లులు చెల్లిస్తే ఈ సమస్యల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
0 comments:
Post a comment