నిరుద్యోగులకు కెనరా బ్యాంకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కేల్1, స్కేల్2 స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం ఈ నియామకాన్ని చేపట్టారు. షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీలో స్కేల్2, స్కేల్3 ఉద్యోగాల భర్తీకి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. మొత్తం 21 విభాగాల్లో 220 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.canarabank.com లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వేతనాలు పోస్టు ఆధారంగా రూ. 23,700 నుంచి రూ.51,490 వరకు చెల్లించనున్నారు. ఒక అభ్యర్థి కేవలం ఒకే పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
అభ్యర్థి ఆన్లైన్లో పరీక్ష ఫీజును డిపాజిట్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడవచ్చు.
అప్లికేషన్ల స్వీకరణకు ప్రారంభ తేదీ: నవంబర్ 25
అప్లికేషన్ల స్వీకరణకు ఆఖరి తేదీ: డిసెంబర్ 15
SC/ST/PWBD అభ్యర్థులకు-రూ. 100+GST, ఇతర అభ్యర్థులకు-రూ. 600+GST
0 comments:
Post a comment