ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ వార్షిక కేలండర్ ప్రకటించాలి: ఎమ్మెల్సీలు
ఈనాడు, అమరావతి:
ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వార్షిక కేలండర్ను ప్రకటించాలని కోరుతూ కమిషన్ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులకు ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులురెడ్డి, రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని, గ్రూపు-2, 3 పరీక్షలకు పాతవిధానం అవలంభించాలని, వయోపరిమితి 47ఏళ్లకు పెంచాలని కోరారు. నెగెటివ్ మార్కుల విధానాన్ని రద్దు చేయాలని విన్నవించారు.
0 comments:
Post a comment