బడిపిల్లలకు బస్సేదీ?
♦అరకొరగా పల్లెవెలుగు బస్సులు
♦పాసులు ఉన్నా ప్రయోజనం శూన్యం
🌻ఏలూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అధికారులు బడులు తెరిచారు కానీ బడి పిల్లల కష్టాలు మరిచారు. ఫలితంగా ప్రయాణ సదుపాయం లేక విద్యార్థులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. విద్యా సంస్థలు తెరిచి దాదాపు నెలరోజులు కావస్తున్నా విద్యార్థుల హాజరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎవరూ ఇప్పటివరకూ విద్యాసంస్థల ముఖం చూడ లేదు. ప్రయాణ సదుపాయం లేకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. విద్యార్థులు విద్యావకాశాలు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలు,మండల కేంద్రాల్లోనే చదువుకుంటారు. వీరంతా బస్సు సదుపాయం వినియోగిం చుకుని రోజువారీ క్లాసులకు హాజరవుతుంటారు. అధికారులు బస్సు సౌకర్యంపై తగిన శ్రద్ధ తీసుకోలేదు. ఫలితంగా హాజరు అంతంత మాత్రంగానే ఉంటోంది.
♦ఈ ఏడాది 10 పాసులు కూడా లేవ్ !
ఈ ఏడాది విద్యా సంస్థలు తెరిచి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకూ పట్టుమని 10 పాసులు కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కిందటేడాది జిల్లాలో 84,813 మంది విద్యార్థులు బస్ పాసులు వినియోగించు కున్నారు. వీటిలో 55,213 ఉచిత పాస్లు కాగా, నెలవారీ పాసులు 3,143, మూడు నెలల పాసులు 25,330, ఏడాది పాసులు 1,127 పాసులు ఉన్నాయి. ఉచిత పాసులు కేవలం పాఠశాల విద్య నభ్యసించే బాల బాలికలకు మాత్రమే ఇచ్చేవారు. వీటిలో 8,9,10 తరగతులు చదివే బాలురకు ఉచిత పాస్లు లేవు. ఈ ఏడాది పాఠ శాలలు, కళాశాలలు తెరిచి నెలరోజులు కావస్తున్నా విద్యా ర్థులు పాసులు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఆయా రూట్లలో ఆర్డినరీ బస్సులు లేకపోవడ మేనని తెలు స్తోంది. ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కాలంటే అదనంగా కాంబినేషన్ టికెట్ తీసుకోవాలి. కానీ ప్రస్తుతం పీటీడీ నడుపు తున్న సర్వీసుల్లో లగ్జరీ, డీలక్స్ సర్వీసులే ఎక్కువగా ఉన్నాయి. లాక్డౌన్కు ముందు జిల్లాలో 587 బస్సులు తిరుగుతుండగా వాటిలో 403 పల్లెవెలుగు బస్సులే ఉండేవి. ప్రస్తుతం జిల్లాలో 294 బస్సులు తిరుగుతుండగా వాటిలో 112 బస్సులు డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర బస్సులు నడుపుతుండగా, పల్లెవెలుగు బస్సులను మాత్రం 178కి కుదించారు. ఇటీవల 193కి పెంచారు. అయినా సరే ప్రస్తుతం జిల్లాలో తిరిగే పల్లెవెలుగు బస్సులు సగానికి సగం మాత్రమేనని స్పష్టమవుతోంది. దీంతో విద్యార్థులకు బడికి వెళ్లేందుకు బస్సులే లేకుండా పోయాయి. ఆటోలకు వెళదామంటే కనీసం 30 నుంచి 50 రూపాయల వరకూ ఖర్చవుతోంది. దీంతో నెలకు రూ. 1500 అదనపు భారం పడు తోంది. ఈ భారం మోయలేక విద్యార్థులు విద్యకు దూరంగా ఉంటున్నారు. పీటీడీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఒక్క D.A కూడా తీసుకు రాలేకపోయారు నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము
ReplyDelete