పాఠశాలల పునః ప్రారంభ షెడ్యూల్ లో మార్పు
◙ ఎనిమిదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి బడి
◙ డిసెంబరు 14 నుంచి 6, 7 తరగతుల వారికి..
◙ మంత్రి ఆదిమూలపు సురేష్
ఈనాడు, అమరావతి:
రాష్ట్రంలో 6, 7, 8 తరగతులకు బడులు పునఃప్రారంభంపై ప్రభుత్వం మార్పులు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి 6, 7, 8 విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి ఉండగా.. 6, 7, తరగతుల ప్రారంభాన్ని డిసెంబరు 14కు వాయిదా వేసింది. డిసెంబరు 14 నుంచి 1-5 తరగతులను ప్రారంభించాల్సి ఉండగా.. సంక్రాంతి పండుగ అనంతరం తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ నెల 2 నుంచి 9, 10 విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తుండగా.. సోమవారం నుంచి ఎనిమిదో తరగతి వారికి పునఃప్రారంభించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రస్తుతం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.45గంటల వరకు కొనసాగుతున్న పాఠశాలలను చలి కారణంగా ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.
0 comments:
Post a comment