Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 5 November 2020

చరిత్ర సృష్టించిన జో బైడెన్!

 

వాషింగ్టన్: డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎవరూ సాధించని రికార్డును చేరుకుని చరిత్ర సృష్టించారు. బుధవారం మధ్యాహ్నం 12.10 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) వరకు నమోదైన పోలింగ్ ప్రకారం.. జో బైడెన్‌కు మొత్తం 6.99 కోట్ల ఓట్లు పోలయ్యాయి. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్క అధ్యక్ష అభ్యర్థి కూడా ఇన్ని ఓట్లను గెలుపొందలేదు. 2008 అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా అత్యధికంగా 6.94 కోట్ల ఓట్లను గెలుపొందగా.. జో బైడెన్ ఒబామా రికార్డును తాజాగా అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పారు. మరోపక్క ట్రంప్‌ ఇప్పటివరకు 6.68 కోట్ల ఓట్లను గెలుచుకున్నారు. జో బైడెన్‌ మ్యాజిక్ ఫిగర్ 270కు చేరుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి.

ప్రస్తుతం ఆయన ఖాతాలో 227 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ట్రంప్ ఇప్పటివరకు 213 ఎలక్టోరల్ ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. నెవాడా, అరిజోనా, అలాస్కా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్‌వేనియా, నార్త్ కరోలినా, జార్జియా రాష్ట్రాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.


US ELECTIONS 2020: వైట్ హౌస్ కు బైడెన్.. విజయం లాంఛనమే... ట్రంప్ కు అమెరికన్ల షాక్

క్షణం క్షణం ఉత్కంఠ. నిమిష నిమిషానికి చేతులు మారుతున్న ఆధిక్యత. ఓ రాష్ట్రంలో ట్రంప్ ముందంజలో ఉంటే మరో రాష్ట్రంలో బైడెన్ స్వీప్ చేస్తాడు. ఆసాంతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చూసినంత మజా. టీ-20 మ్యాచ్ లలో డబుల్ సూపర్ ఓవర్ కు వచ్చినంత కిక్. ఎవరు గెలుస్తున్నారో.. ఎవరు ఓడుతున్నారో చెప్పలేని పరిస్థితి. మహా మహా రాజకీయ నాయకులు సైతం ఫలితాల ట్రెండ్ ను చూసి తలలు పట్టుకున్నారు. ఏం విశ్లేషణ చేయాలో వారికీ అర్థం కావడం లేదు. ట్రంప్ గెలిచారని చెబుతామనుకునేసరికి బైడెన్ ఆధిక్యంలోకి వస్తున్నాడు. ఇక బైడెన్ విజయం మీద నల్లేరు మీద నడకే అనుకునేలోపే ట్రంప్ దూసుకొస్తున్నాడు. ఇదీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల పరిస్థితి. 24 గంటలు గడిచినా ఫలితం తేలే ఉంది.

మరోవైపు అభ్యర్థులిద్దరూ విజయం మాదంటే మాదే అంటూ ప్రకటించుకున్నారు. ఇక తుంటరి ట్రంప్ అయితే.. నేనే విజయం సాధించానని.. తన విజయం అంతకుముందే ఖరారైందని.. జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ మోసం అని తేల్చేశాడు. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు అధ్యక్ష పీఠం కైవసం చేసుకోవడానికి అడుగుదూరంలో నిలిచిన బైడెన్.. 'రా.. కోర్టులోనే చూసుకుందాం..' అంటూ సవాళ్లు విసరుతున్నారు.

అత్యంత ఉత్కంఠల మధ్య సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నది. అభ్యర్థిలిద్దరూ హోరాహోరి పోటీతో దూసుకుపోతున్నారు. ఇద్దరు నూవ్వానేనా..? అనే రీతిలో పోటీ పడుతున్నా.. పాపులర్ ఓట్లలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపే అమెరికా మొగ్గు చూపినా.. కీలకమైన ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లలో మాత్రం బైడెన్ ముందంజలో ఉన్నారు. మొత్తం ఎలక్ట్రోరల్ స్థానాలు 538 కాగా.. అందులో అధ్యక్ష పీఠాన్ని సాధించడానికి 270 ఓట్లు సాధించాలి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. డెమొక్రట్ల అభ్యర్థి జో బైడెన్ కు 253 ఓట్లు రాగా.. డొనాల్డ్ ట్రంప్ కు 214 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇద్దరి మధ్య పాపులర్ ఓట్లలో స్వల్ప తేడాలున్నా.. ఎలక్ట్రోరల్ ఓట్లలో బైడెన్ దూసుకుపోతున్నాడు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే బైడెన్ సాధించాల్సిన ఓట్లు ఇంకా 17 మాత్రమే.మరో ఆరు రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇవి కూడా బైడెన్ అనుకూల రాష్ట్రాలే అని అమెరికా మీడియా చెబుతున్నది. దీని ప్రకారం చూస్తే.. ఈ సారి వైట్ హౌస్ లో కాలరెగిరేసిది బైడెనే అని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఆ ఆరు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది.

ఇప్పటివరకు 44 రాష్ట్రాల్లో పలితాలు వెల్లడయ్యాయి. ఇక ఫలితం తేలబోయే మిచిగాన్, అరిజోనా తో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బైడెన్ వైపే మొగ్గు ఉందని తెలుస్తుంది. అరిజోనాలో ట్రంప్ పై బైడెన్ 3.4 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అరిజోనాతో పాటు అలాస్కా, జార్జియా, నార్త్ కరోలినా, నెవాడా, పెన్సిల్వేనియా ఫలితాలు వెలువడాల్సి ఉంది.

కాగా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, జార్జియా లలో ట్రంప్ అధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ అధ్యక్ష పీఠం చేరుకునేంత ఓట్లు సంపాదించుకోవడం కష్టమే. మొత్తంగా చూస్తే బైడెన్ విజయం దాదాపు ఖరారైనట్టే. మిగిలింది లాంచనంగా ప్రకటించడమే మిగిలి ఉంది.

వైట్ హౌస్‌కు ఆరు ఓట్ల దూరంలో బైడెన్..!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సొంతం చేసుకున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ వైట్ హౌస్‌కు ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో నిలిచారు. బైడెన్ ఇప్పటివరకు 264 ఓట్లు సాధించగా, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్‌ విజయానికి మరో ఆరు ఎలక్టోరల్ ఓట్లు రావాల్సి ఉన్నది. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, అందులో 270 ఓట్లు గెలిచినవారే విజేతగా నిలుస్తారు.


మొత్తం 50 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా, ఇప్పటివరకు 45 రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మరో 5 రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, నెవాడా, అలస్కాలో ఇంకా ఫలితాలు రావాల్సి ఉన్నది.

ఇందులో పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కలోలినా, అలస్కాలో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, నెవాడాలో బైడెన్ ముందంజలో ఉన్నారు.


బైడెన్ ఖాతాలో రాష్ట్రాలు


అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న బైడెన్ ఇప్పటికే మిషిగన్ (16), కాలిఫోర్నియా (55), న్యూయార్క్ (29), న్యూజెర్సీ (14), వర్జీనియా (13), వాషింగ్టన్ (12), ఇల్లినోయ్ (20), ఆరిజోనా (11), మసాచుసెట్స్ (11), మిన్నెసొటా (10), మేరీలాండ్ (10), కొలరాడో (9), కనెక్టికట్ (7), ఓరెగన్ (7), న్యూమెక్సికో (5), న్యూహాంప్‌షైర్ (4), రోడ్ ఐలండ్ (4), డీసీ (3), వెర్మాంట్ (3), డెలవెర్ (3), హవాయి (4), విస్కాన్సిన్ (10) రాష్ట్రాల్లో విజయం సాధించారు.


ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు


స్వింగ్‌ స్టేట్స్‌గా పిలిచే కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా (20), జార్జియా (16), నార్త్ కరోలినా (15), అలస్కా (3)లో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే టెక్సాక్ (38), ఫ్లోరిడా (29), ఒహయో (18), టెన్నెస్సీ (11), ఇండియానా (11), మిస్సోరి (10), అలబామా (9), సౌత్ కరోలినా (9), లూసియానా (8), ఓక్లహామా (7) కెంటకి (8) రాష్ట్రాలు ట్రంప్ ఖాతాలో పడ్డాయి.


ఒబామాను అధికగమించిన బైడెన్‌


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిగా బైడెన్ రికార్డు సాధించారు. ఒబామా పేరిట ఉన్న రికార్డును బైడెన్ అధిగమించారు. 2008 ఎన్నికల్లో ఒబామా 6,94,98,516 ఓట్లు సాధించారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top