💁♀️కోర్టు ఉత్తర్వులకు లోబడి అడ్మిషన్లు..
🔰విద్యార్థులు ఆందోళన చెందొద్దు..
🔰స్పష్టతనిచ్చిన ఇంటర్ బోర్డు...
🍁అమరావతి, ఆంధ్రప్రభ
🔰రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియలో నెలకొన్న ప్రతిష్టంభనపై విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యామండలి స్పందించింది.
🔰అడ్మిషన్ల ప్రక్రియ,సీట్ల విషయంలో ఇంటర్ అడ్మిషనపై ప్రతిష్టంభన' పేరుతో 'ఆంధ్రప్రభలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణప్పందించి విద్యార్థులు ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
🔰కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున తుది తీర్పునకు లోబడి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అడ్మిషన్ల ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేదని పేర్కొన్నారు.
🔰ఆన్ లైన్ అడ్మిషన్ల గురించి మార్చి మూడో తేదీన అన్ని కళాశాలలకు సర్క్యులర్ విడుదల చేశామని గుర్తు చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందుగానే బోర్డు వెబ్ సైట్లో స్టెప్ టు స్టెప్ డిబెయిల్స్, యూజర్ మాన్యువల్ ను విద్యార్థులకు అందుబాటులో ఉంచామని వివరించారు.
🔰అయితే కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఇన్ టేక్ వివరాలను నమోదు చేయకపోవడం వల్ల వాటి పేర్లు ఆన్లైన్ వెబ్ సైట్ లో కనిపించడం లేదని, ఆ కళాశాలల వివరరాలను కూడా బోర్డు మంజూరు చేసిన గ్రూపులు, సెక్షన్ల ప్రకారం కనిపించేలా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
🔰కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఫైర్ ఎన్ వోసీ లేని కళాశాలలను కూడా 60 రోజుల గడువుతో అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశామని కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. వ్యాపార భవన సముదాయాల్లో, రేకుల షెడ్లలో నడుపుతున్న కళాశాలలు కూడా 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రం అనుమతించామని చెప్పారు.
🔰కొత్తగా మంజూరు చేసిన 208 కళాశాలలతో కలిపి మొత్తం 7 లక్షల 42 వేల 780 సీట్లు అందుబాటులోకి వచ్చాయని, కనుక సీట్లు లభించవేమోనని తల్లి దండ్రులు అందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు.
🔰ఆన్లైన్ అడ్మిషన్నప్రక్రియ కొనసాగింపు, సీట్ల సంఖ్య హైకోర్టు ఉత్తర్వులకు లోబడే ఉంటుందని స్పష్టం చేశారు. ఇంటర్ అడ్మిషన్లు, సీట్ల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ పేర్కొన్నారు.
0 comments:
Post a comment