కొత్త జిల్లాలు వస్తున్నాయి..'పోలీసు' బదిలీలు చేయొద్దు: డీజీపీ
అమరావతి: పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లోనూ బదిలీలు ఆపేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభు త్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో కానిస్టేబుల్ నుంచి పైస్థాయి అధికారి వరకూ ఏ ఒక్కరినీ బదిలీ చేయవద్దని స్పష్టంగా నిర్దేశించారు. జనరల్ రైల్వే పోలీస్, సీఐడీ, ఇంటెలిజెన్స్, ఏపీఎస్పీతోపాటు శాంతిభద్రతల విభాగాలైన రేంజ్‌లు, ఎస్పీల పరిధిలో తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు.
0 comments:
Post a comment