భారతదేశంలో నివశించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. అయితే చాలామంది వివిధ కారణాల ఇతర ప్రాంతాల్లో నివాసం సాగిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ను మార్చుకోవడానికి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చాలామంది ప్రస్తుతం ఉన్న అడ్రస్ నే ఆధార్ కార్డులో మార్చుకోవాలని అనుకున్నా ఎలా మార్చుకోవాలో సరైన అవగాహన ఉండదు.
అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా సులభంగా ఆన్ లైన్ లో అడ్రస్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలని అనుకుంటే యూఐడీఏఐ అధికార వెబ్ సైట్ htpps://uidai.gov.in వెబ్ సైట్ ను మొదట ఓపెన్ చేయాలి. అందులో update aadhaar అనే సెక్షన్ ను ఎంపిక చేసుకుని update your address online అనే లింక్ పై క్లిక్ చేయాలి,.
ఆ తరువాత అందులో కొత్త పెజీ ఓపెన్ అవుతుంది.
అందులో proceed to update aadhaar address అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకుని ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. అనంతరం రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఆధార్ ప్రూఫ్ అప్ లోడ్ చేసి సులువుగా ఆధార్ కార్డులోని అడ్రస్ ను మార్చుకోవచ్చు. ఆన్ లైన్ లో మార్చుకోవడం సమస్యలు ఎదురైతే ఆఫ్ లైన్ లో అడ్రస్ ను సులువుగా మార్చుకోవచ్చు.
యూఐడీఏఐ వెబ్ సైట్ ఆధార్ కార్డులో అడ్రస్ లో మార్పులు చోటు చేసుకుంటే ప్రజలు సులువుగా మార్చుకొనే సదుపాయన్ని కల్పిస్తోంది. ఆధార్ కేంద్రాలను సంప్రదించి లేదా ఆధార్ సేవలను అందించే బ్యాంకులను సంప్రదించి అడ్రస్ ను సులువుగా మార్చుకోవచ్చు.
0 comments:
Post a comment