ఆవేదన... ఆందోళన
♦ప్రభుత్వ నిబంధనలతో నష్టపోతున్న ఉపాధ్యాయులు
♦ఉద్యమానికి సిద్ధమైన సంఘాలు
🌻మచిలీపట్నం (గొడుగుపేట) న్యూస్టుడే
ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా చేపట్టిన ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల నుంచి వచ్చిన దరఖాస్తులు పరిశీలన చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఓ పక్కన బదిలీల ప్రక్రియ సాగుతున్నా నిర్వహణతీరులో ఉన్న సమస్యలతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పలు అంశాల్లో మార్పులు చేయకపోతే చాలామంది ఉపాధ్యాయులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు తమ డిమాండ్లసాధనకోసం నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నాయి.
బదిలీల్లో భాగంగా ఉపాధ్యాయుల సర్వీసునుబట్టి పాయింట్లు కేటాయిస్తారు. అవి వారికి అనువైన ప్రదేశం రావడానికి దోహదపడతాయి. అలా ఏడాదికి అర మార్కు చొప్పున కేటాయిస్తారు. ఆ ప్రకారం 30 ఏళ్ల సర్వీసు వరకు 15 పాయింట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 ఏళ్లు సర్వీసు దాటినా కూడా అదే 15 పాయింట్లు కేటాయించాలి. దీనివల్ల 30 ఏళ్ల సర్వీసు దాటిన ఉపాధ్యాయులు పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి వారు జిల్లావ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. దీంతోపాటు ఒకే పాఠశాలలో 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు కచ్చితంగా బదిలీ కావాల్సి ఉంది. బదిలీల్లో జరిగిన జాప్యం కారణంగా పలు ప్రాంతాల్లో ఒకే పాఠశాలలో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. వాళ్లకు కూడా 8 ఏళ్లనే ప్రామాణికంగా తీసుకుని పాయింట్లు కేటాయిస్తున్నారు. దీనివల్ల కూడా చాలామంది ఉపాధ్యాయులు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ విషయాలను ఉపాధ్యాయ సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉపాధ్యాయులు ఏంచేయాలో తెలియక ఉద్యమం ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
♦అనేక సమస్యలు
జిల్లావ్యాప్తంగా ఛైౖల్డ్ఇన్ఫోలో విద్యార్థుల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు కాకపోవడం వల్ల పోస్టులు కోల్పోవాల్సి వస్తుంది. దీంతోపాటు ఖాళీల జాబితా ప్రదర్శించకపోవడం, 30శాతం పోస్టులను బ్లాక్ చేయడం లాంటి అంశాలను సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ ప్రభుత్వం ఉన్నంతవరకు ఉద్యోగస్తులు పస్తులు ఉండాల్సిందే D. A లు రావు PRC రాదు ఈలాంటి ప్రభుత్వాన్ని మనము ఎన్నడూ చూసి ఉండము అన్నీ మరచిపోండి ఉద్యోగ సంఘాలు అలానే ఉన్నాయి
ReplyDelete