🔳ఉద్యోగుల స్థాయి పెంపుపై పరిశీలన చేయాలి
రీ-సర్వే నేపథ్యంలో రెవెన్యూ శాఖకు సీఎం జగన్ ఆదేశాలు
ఈనాడు, అమరావతి: భూముల రీ-సర్వే నేపథ్యంలో సర్వే శాఖలోని ఉద్యోగుల స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయం రెవెన్యూ శాఖకు సూచించింది. త్వరలో రీ-సర్వే జరగనున్నందున సర్వే శాఖలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని, గతానుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆచార్యులు సీఎం జగన్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై సీఎం ఆదేశాల మేరకు ఉద్యోగుల డిమాండ్లు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయ అధికారులు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ పంపారు. సర్వే ఉద్యోగులకు పూర్తిస్థాయిలో శిక్షణ, జీరో సర్వీసుతో బదిలీలు, మొబైల్ కోర్టుల్లో అధికారులకు స్థానం కల్పించడం, ఉద్యోగులకు టీఏ, డీఏ చెల్లింపు, ల్యాప్టాప్లు, సాఫ్ట్వేర్, స్టేషనరీ సమకూర్చాలని, మినిస్టీరియల్ ఉద్యోగులను శాశ్వత లేదా పొరుగు సేవల విధానంలో నియమించడం, అవసరమైన పక్షంలో సర్వే చట్టాలు సవరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.
0 comments:
Post a comment