🌼కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కమిటీ
☀️త్వరలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది.
🎯ఈ మేరకు సోమవారం జిఓ ఆర్టి నెంబరు 685ను జారీ చేసింది.
☀️తొలుత వైద్యులు, ఫ్రంట్ లైన్ వారియర్‌కు వ్యాక్సిన్ అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం పదిమందితో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది.
🎯రాష్ట్ర స్థాయి కమిటీకి వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
చైర్మన్ గా, రాష్ట్ర ఇమ్యునిజేషన్ అధికారి
కన్వీనరుగా వ్యవహరించనున్నారు.
☀️వీరితోపాటు ఎనిమిది మంది సభ్యులుగా ఉంటారు.
🎯జిల్లా స్థాయి కమిటీల్లో కలెక్టరు చైర్మన్ గా జిల్లా ఇమ్యునిజేషన్ అధికారి మెంబరు
కన్వీనరుగా,
జిల్లా వైద్యాధికారితో పాటు జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ, విద్యాశాఖ,
సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, హోమ్, రెవెన్యూ, కార్మికశాఖ, భూగర్భ గనుల శాఖ, గిరిజన
సంక్షేమ శాఖ అధికారులు మెంబర్లుగా వ్యవహరించనున్నారు.
0 comments:
Post a comment