అమరావతి: రాజధాని అనుబంధ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇంప్లీడ్ అవుతామని దాఖలు చేసిన ఫిటిషన్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. విశాఖ గెస్ట్ హౌస్ ప్లాన్ తయారు చేశాక కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హైబ్రిడ్(భౌతిక, వీడియో కాన్ఫరెన్స్) విధానంలో ఈ వ్యాజ్యాలను విచారిస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ పరిపాలన రాజధానిలో భాగంగా నిర్మిస్తే పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురావచ్చని తెలిపింది. పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చాక వాదనలు వింటామని స్పష్టం చేసింది.
ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.
0 comments:
Post a comment