పత్రికా ప్రకటన
***************
అధికసంఖ్యలో 8వ తరగతి విద్యార్థులు హాజరు.
తొలిరోజు 70 శాతం హాజరు
కోవిడ్ జాగ్రత్తలతో పాఠశాలలు
విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్ వెల్లడి.
అమరావతి : పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులు తొలిరోజే అత్యధికసంఖ్యలో హాజరయ్యారు. ఈనెల 2 నుంచి ఇప్పటివరకు 9, 10 తరగతులు మాత్రమే పాఠశాలల్లో భోదన జరిగింది. సోమవారం 8వ తరగతి విద్యార్థులకోసం కూడా తరగతులు నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల హాజరుకు సంభందించిన వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
సోమవారం 46.28 శాతం 10వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 41.61 శాతం హాజరయ్యారు. అయితే తరగతులు ప్రారంభించిన తొలిరోజే 8వ తరగతి విద్యార్థులు అత్యధికంగా 69.72 శాతం హాజరయ్యారు. మొత్తం 5,70,742 మంది విద్యార్థులకు 3, 96, 809 మంది హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో 82.34 శాతం అత్యధికంగా హాజరు కాగా విశాఖపట్నం జిల్లాలో తక్కువ శాతం 53.14 నమోదైంది. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నాం. డిసెంబర్ 14 తరువాత 6, 7 తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది.
కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
****************
శ్రీనివాస్, పి. ఆర్. ఓ టు ఎడ్యుకేషన్ మినిస్టర్.
0 comments:
Post a comment