598 మంది ప్రధానోపాధ్యాయులకు తాఖీదులు
కర్నూలు విద్య, న్యూస్టుడే : మన బడి నాడు-నేడు పనుల్లో నిర్లక్ష్యం వహించిన 598 మంది ప్రధానోపాధ్యాయులకు తాఖీదులు జారీ చేశారు. నాడు-నేడు అభివృద్ధి పనులపై మంగళవారం విద్యాధికారులతో జేసీ రాంసుందర్రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నాడు-నేడు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో నమోదు చేయడంలో అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు తాఖీదులు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు. మోమోలు పొందిన ప్రధానోపాధ్యాయులకు ఈనెల వేతనం నిలుపుదల(హోల్డ్) చేయాలని, ఇప్పటికైనా మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఈవో ఎం.సాయిరాం, ఎపీసీ వేణుగోపాల్ పాల్గొన్నారు.
*విద్యార్థుల హాజరు నమోదు తప్పనిసరి*
కర్నూలు విద్య, న్యూస్టుడే: పాఠశాల విద్య ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు హాజరైన విద్యార్థుల వివరాలను స్టూడెంట్ అటెండెంట్స్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ మొబైల్ యాప్లో విధిగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి ఎం.సాయిరాం ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులు అమలు చేయని వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
0 comments:
Post a comment