YSR Zero Interest Scheme : అన్నదాతల సంక్షేమానికి సీఎం జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం త్వరితగతిన సహాయం అందించడంలోనూ రికార్డు నెలకొల్పుతోంది. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డీ రాయితీ (వైఎస్సార్ సున్నా వడ్డీ సహాయం), గత నెలలో వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన వారికి పెట్టుబడి రాయితీ మొత్తాలను మంగళవారం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 2020, నవంబర్ 17వ తేదీ మంగళవారం సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, పెట్టుబడి రాయితీ మొత్తాలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
రూ. 642.94 కోట్లు ఆన్ లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటికే రెండు పథకాల లబ్దిదారుల బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబర్, ఇతర వివరాలను అధికారులు తీసుకుని నిధులు వారికి బదలాయించేందుకు ఏర్పాట్లు చేశారు. పంట నష్టపోయిన రైతులకు నెల రోజుల్లోపే పెట్టుబడి రాయితీ అందిస్తుండడం గమనార్హం.
2019 ఖరీఫ్ పంట రుణాలకు సంబంధించి దాదాపు 14.58 లక్షల మంది రైతులకు రూ. 510. 32 కోట్ల వడ్డీ రాయితీ, గత నెలలో ఖరీఫ్ పంటలు దెబ్బ తినడం వల్ల నష్టపోయిన రైతులకు రూ. 132.62 కోట్ల పెట్టుబడి రాయితీ కలిపి మొత్తం రూ. 642.94 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
అక్టోబర్ లో దెబ్బతిన్న వ్యవసాయ పంటలు (హెక్టార్లలో) 73,707.97
నష్టపోయిన రైతులు : 1,66,608.
దెబ్బతిన్న ఉద్యాన పంటలు (హెక్టార్లలో) 13,516.24.
నష్టపోయిన రైతులు : 30,525
మొత్తం రైతులు : 1,97,133.
జమ కానున్న పెట్టుబడి రాయితీ (రూపాయల్లో) : 132,62,32,000
0 comments:
Post a comment