ప్రశాంతంగా తరగతులు
50శాతానికి పైగ హాజరు
ఆహ్లాదకరంగా ప్రభుత్వ పాఠశాలలు
🌻అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశాంత వాతా వరణంలో తరగతులు జరుగుతున్నా యని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒకవైపు నాడు నేడు పనులతో పాఠశాలల రూపు రేఖలు మారుతుండగా.. మరోవైపు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీతో జరుగుతున్న వారోత్స వాలు పాఠశా లల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి రోజూ 50శాతం తగ్గకుండా విద్యా ర్థులు తరగతులకు హాజరవుతున్నార నిస్పష్టం చేశారు. బుధవారం 10వ తరగతి విద్యార్థులు 43.75 శాతం విద్యార్థులు హాజరు కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,74,733 మందికి గాను 2,95,199 మంది హాజరయ్యారని వెల్లడించారు. అదే విధంగా 9వ తరగతి విద్యార్థులు హాజరు శాతం 40 శాతం ఉందని మొత్తం 6,84,722 మందికి 2,74,204 మంది హాజరయ్యారని తెలిపారు. మరో వైపు 8వ తరగతి విద్యార్థులు 51 శాతం 6, 81 917 మందికి గాను 3,47, 979 మంది హాజరయ్యారని వెల్లడించారు పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహణతో పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు, శానిటైజర్లు వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
0 comments:
Post a comment