30 మంది ప్రధానోపాధ్యా యులకు మెమోలు
🌻గుంటూరు ఎడ్యుకేషన్: జగనన్న గోరుముద్ద వివరాలను యాప్లో నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన 30 మంది ప్రధానోపాధ్యా యులకు డీఈఓ ఆర్.ఎస్.గంగాభవాని శుక్రవారం మెమోలు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రోజూ పాఠశాలల వారీగా భోజనం చేసిన విద్యార్థుల వివరాలను యాప్లో విధిగా నమోదు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎంలకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మెమోలు ఇచ్చిన డీఈఓ, మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
0 comments:
Post a comment