2నెలల్లో చెల్లించకుంటే వడ్డీ తప్పదు
♦వేతన బకాయిలపై ఏపీకి సుప్రీం ఆదేశం
🌻న్యూఢిల్లీ/అమరావతి, నవంబరు 18( ఆంధ్రజ్యోతి):* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం, పెన్షనర్ల పింఛను బకాయిలను రెండు నెలల్లో చెల్లిస్తే.. వడ్డీ మాఫీ చేస్తామని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షన ర్లకు మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వం సగం వేతనాలు, సగం పించన్లు మాత్రమే ఇచ్చింది. దీనిపై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా అక్టోబరు 11వ తేదీ కల్లా వేతన బకాయిలను 12% వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ యితే, ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై బుధ వారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్ర, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే వాదనలు వినిపించారు. కరోనాతో తలెత్తిన ఆర్థిక సమ స్యల వల్ల జీతాలు, పింఛన్లలో కోత విధించాల్సి వచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు కోత విధించిన మొత్తాన్ని చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే, 12% వడ్డీ చెల్లించే పరిస్థితి లేదని, దీనిపై స్టే విధించాలని అభ్య ర్థించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం.. వేతన బకాయిలు చెల్లిం చడానికి ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. 2 నెలలు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పగా, జనవరి 15వ తేదీలోగా ఉద్యోగులకు బకాయిలు పూర్తిగా చెల్లించాలని, అప్పుడే వడ్డీని మాఫీ చేస్తామని సుప్రీంకోర్టు తీర్పు వెలువ రించింది. ఈ విచారణకు ప్రభుత్వ న్యాయవాది మహ్పూజ్ నజ్కీ హాజరయ్యారు.
0 comments:
Post a comment