బడికి గైర్హాజరైతే వేటు ఖాయం - 12 మందికి షోకాజ్ నోటీసులు
🌻చిత్తూరు కలెక్టరేట్: విధుల నిర్వహణలో నిజాయితీ, కచ్చితత్వం, అంకి తభావం తప్పనిసరి అని డీఈవో నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్లు బడికి గైర్ర్హాజరైతే వేటు ఖాయమని హెచ్చరించారు. సోమ, మంగళవారాల్లో జిల్లాలోని ఏర్పేడు, గంగాధర నెల్లూరు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు కూడా పలువురు ఉపాధ్యాయులు బడికి రాలేదన్నారు. రోజూ తప్ప నిసరిగా తనిఖీలు ఉంటాయని, టీచర్లు గైర్హాజరైనట్లు తెలిస్తే కఠినంగా వ్యవహరిస్తానని ఆయన హెచ్చరించారు. ఏర్పేడు మండలం పల్లం హైస్కూ లో విధులకు హాజరుకాని 8 మంది టీచర్లు, క్లర్క్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. హెచ్ఎం బాలాజీ, టీచర్లు మెహర్ బాబు, సోమశే ఖర్ రాజు, చలపతి, రామసుబ్బమ్మ, రెడ్డెప్ప, గంగిరెడ్డి, రామకృష్ణ, క్లర్క్ రెహ మాన్ గైర్హాజరయ్యారని చెప్పారు. అలాగే గంగాధరనెల్లూరు మండలంలోని కాళేపల్లె హైస్కూల్ హెచ్ఎం నిర్మల, పీఈటీ మురళి, టీచర్ కృష్ణవేణి గైర్హాజ రయ్యారని తెలిపారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా బడికి రాని మొత్తం 12 మందికి నోటీసులు జారీ చేశామన్నారు. మూడు రోజుల్లోగా వారందరూ లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించినట్లు డీఈవో తెలిపారు.
0 comments:
Post a comment