World Egg Day 2020: బ్రేక్‌ఫాస్ట్‌గా రోజూ గుడ్డు తింటే.. బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్..
గుడ్డులో ఉండే ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ విధంగా ఐరన్ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కేన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వేలి గోళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. వాస్తవానికి సూర్యరశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డీ లభిస్తుంది. ఎండలో తిరగలేని వారికి గుడ్డు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
కాగా, అల్పాహారంగా గుడ్డు తింటే మంచిది. గుడ్డును అల్పాహారంగా తీసుకుంటే బరువు తగ్గుతారు. గుడ్డులో విటమిన్ ఏ కూడా ఉంటుంది. దీనివలన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చిన్నపిల్లలకు గుడ్డును ఇవ్వడం వలన వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుడ్డు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని శాస్త్రీయ పరిశోధనల్లో నిర్థారణ అయ్యింది. అలాగే గుడ్డులో పొటాషియం, కాల్షియం ఉంటుంది. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇలా రోజు ఒక గుడ్డు తీసుకుంటే నరాల బలహీనత తగ్గి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
రోజూ రెండు గుడ్లు తింటే మీ శరీరంలో ఎర్రరక్త కణాలు మెరుగుపడుతాయని అధ్యయనంలో తేలింది. శరీరంలో గుడ్ కొలస్ట్రాల్ పెంచేందుకు, చర్మ ఆరోగ్యానికి కూడా గుడ్డు దోహదపడుతుంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా గుడ్డును తీసుకోవడం ద్వారా ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు?ఆరోగ్యవంతులు రోజూ రెండు గుడ్లు తినొచ్చని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు గుడ్డు ఉపయోగపడుతోంది. గుడ్డులోని సొనలో విటమిన్ డీ ఉంటుంది. ఇది జలుబు, ఫ్లూ సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతోంది. అందుకే కరోనా నేపథ్యంలో రోజూ గుడ్డును తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రోజూ గుడ్డు తింటే సౌడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?
చివరల్లో మరో మాట...గుడ్డు రోజూ తినడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఇప్పటి వరకు ఏ శాస్త్రీయ అధ్యయనంలోనూ నిర్థారణ కాలేదు. అయితే రోజూ ఎన్నంటే అన్ని తినకుండా...రోజూ ఒకట్రెండు గుడ్లు మాత్రమే తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిర్థారించారు.
మరెందుకు ఆలస్యం...ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే ఒకట్రెండు గుడ్డులను రోజూ లొట్టలు వేసుకుంటూ లాగించేయండి.
0 comments:
Post a comment