ఈ మధ్య కాలంలో చాలా మంది Whatsappలో మనకు ఓ మెసేజ్ పంపిస్తారు. ఆ తర్వాత మనసు మార్చుకుని గానీ, లేదా మనల్ని ఆటపట్టించడానికి గానీ పంపించిన మెసేజ్‌ని మళ్లీ Delete for Everyone అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకు కనిపించకుండా డిలీట్ చేస్తారు. ఇలా అవతలివారు డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం కోసం అనేక రకాల టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అన్నిటి కంటే సులభమైన టెక్నిక్ ఇక్కడ చూద్దాం.
దీనికోసం మీరు చేయాల్సింది ఈ లింక్ నుండి WhatsTool అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం! దాన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత, అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేకరకాల పనులు చేస్తుంది. ఆ టూల్ హోమ్ స్క్రీన్‌లో recover deleted messages అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
అయితే ఈ అప్లికేషన్ పనిచేయాలంటే ఖచ్చితంగా మీ ఫోన్ లో వాట్సాప్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయబడి ఉండాలి. చాలామంది ఫోన్లో ఇవి ఆటోమేటిక్‌గా ఎనేబుల్ చేయబడి ఉంటాయి కాబట్టి వర్రీ అవ్వాల్సిన పనిలేదు. అయితే ఒకవేళ మీకు మీరు వాట్సాప్ నోటిఫికేషన్స్ డిజేబుల్ చేస్తే మాత్రం, ఈ టూల్ సక్రమంగా పని చేయడం కోసం నోటిఫికేషన్స్ మళ్లీ ఎనేబుల్ చేయండి. ఆ తర్వాత WhatsTool అనే ఈ అప్లికేషన్ ఈ ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్స్ చదవగలిగే విధంగా పర్మిషన్ ఎనేబుల్ చేయాలి.
ఇక merit 5 బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ మీ ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్స్ పరిశీలిస్తూ, వాటిని జాగ్రత్తగా సేవ్ చేసి, ఒకవేళ అవతలి వ్యక్తి తాను పంపించిన మెసేజ్ డిలీట్ చేసినప్పటికీ, ఈ అప్లికేషన్ వాటిని మళ్లీ మనకు చూపిస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా పొడవాటి వీడియోలను పల్లి ముక్కలుగా చేసుకోవడం, వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేయడం వంటి అనేక రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
0 comments:
Post a comment