Teaching Solution: ఊరే స్కూలు... ఇళ్లే బ్లాక్ బోర్డులు... ఆ టీచర్ల కృషికి నెటిజన్ల ప్రశంసలు
Teaching Solution in Jharkhand: మనందరికీ తెలుసు ఆన్లైన్ చదువులు అంతంత మాత్రంగా కొనసాగుతున్నాయని. ఇంకా చెప్పాలంటే... ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లలకు... ఆన్లైన్ క్లాసులు అర్థం కావట్లేదు. పిల్లల తల్లిదండ్రులకు... వాళ్లను ఎలా చదివించాలో తెలియని పరిస్థితి. విద్యార్థికి ఏదైనా డౌట్ వస్తే... అడిగేందుకు వెంటనే వీలుకాదు. టెక్నాలజీ లేని మనకు ఆన్లైన్ చదువులతో అన్నీ సమస్యలే. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా ఉంటే... మరి బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల పరిస్థితేంటి? సాధారణ రోజుల్లోనే అక్కడి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపరు. అలాంటిది ఈ కరోనా కాలంలో వాళ్లకు చదువులు సాగేదెలా? మన దగ్గర ఎలాగైతే...
ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తున్నామో... అక్కడా అలాగే టీచర్లు... ఎలాగైనా చదివించేందుకు గట్టి పట్టుదలతో, సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు.
ఫొటోల్లో మనం చూస్తున్నది జార్ఖండ్‌లోని ధుమ్కా జిల్లాలో దృశ్యాలు. అక్కడి గవర్నమెంట్ టీచర్లు ప్రాబ్లం సాల్వింగ్... డిజైన్ థింకింగ్ అనే విధానంలో ఆలోచించారు. ఓ గ్రామాన్ని పూర్తిగా స్కూలులా మార్చేశారు. అంటే... ఆ ఊళ్లోని ప్రతి ఇంటినీ ఓ స్కూలుగా మార్చారు. అంటే... ఇళ్ల గోడలపై... సేఫ్ డిస్టాన్స్ పాటిస్తూ... బ్లాక్ బోర్డుల లాగా పెయింటింగ్స్ వేశారు. అంటే... ప్రతీ ఇంటికీ... మూడు లేదా నాలుగు బ్లాక్ బోర్డులు ఇప్పుడు ఉన్నాయి. తద్వారా పిల్లలు స్కూలుకు వెళ్లాల్సిన పని లేదు. ఇంటి బయటే వరండాలో తమ తమ బ్లాక్ బోర్డు దగ్గరే పుస్తకాలతో కూర్చోవచ్చు. ఇక టీచర్లు... స్పీకర్లను ఉపయోగించి... పాఠాలు చెబుతున్నారు. వాళ్లు చెప్పే పాఠాలు... స్పీకర్ సౌండ్ వల్ల... ఊరి అందరికీ వినిపిస్తున్నాయి. తద్వారా పిల్లలంతా ఆ లెసన్స్ వింటూ... తమకు వచ్చే డౌట్లను బ్లాక్ బోర్డులపై రాస్తున్నారు. ఆ తర్వాత... టీచర్లు... ప్రతి స్టూడెంట్ దగ్గరకూ వెళ్లి... ఆ విద్యార్థికి వచ్చే డౌట్‌ను స్పీకర్ ద్వారా అందరికీ చెప్పి... సొల్యూషన్ చెబుతున్నారు. తద్వారా... అందరు పిల్లలూ వాటిని వింటున్నారు.
ఇలా టీచర్లు చేస్తున్న సరికొత్త కృషికి... సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తమ పిల్లల చదువుల కోసం ఆ టీచర్లు అంతలా కష్టపడుతుంటే... వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందపడుతున్నారు. పిల్లల్లో కూడా ఈ రకం చదువులు ఆసక్తిని పెంచాయి. ఇది వరకూ స్కూల్ కి వెళ్లేందుకే ఆసక్తి చూపని విద్యార్థులు... ఇప్పుడు మాత్రం తమ కోసం టీచర్లు అంతలా కష్టపడుతున్నారని గ్రహించి... ఇంటి దగ్గరే ఉంటూ బాగా చదువుతున్నారు. ఇది మంచి ఆలోచనే. దీని వల్ల పిల్లలకు కరోనా వచ్చే ఛాన్సే లేదు. ఆన్లైన్ చదువులతో ఇబ్బందీ లేదు. పిల్లల తల్లిదండ్రులకూ టెన్షన్ లేదు. చదువులు కూడా ముందుకు సాగుతున్నాయి

0 comments:
Post a comment