🔳Son of a rickshaw puller who joined London School
లండన్ స్కూల్లో చేరిన రిక్షావాలా కొడుకు
న్యూఢిల్లీ : మహీంద్రా గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ అయిన మహింద్ర సింగ్.. తన ట్విట్టర్ ద్వారా స్ఫూర్తివంతమైన, ఆసక్తికరమైన పోస్ట్‌లు చేస్తుంటారు. అటువంటి స్పూర్తినిచ్చే ఒక వార్తను పోస్ట్ చేశారు. లండన్‌లోని ఓ వార్తా పత్రికలో ఉన్న భారతీయ యువకుడి న్యూస్ క్లిప్పింగ్‌ని పోస్ట్ చేశారు. ఆ క్లిప్పింగ్స్‌ని తన ఫ్రెండ్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ క్లిప్పింగ్ ఢిల్లీలోని వికాసపురిలో రిక్షావాలా కొడుకు కమలాసింగ్ది. అతని వయసు ఇరవై ఏళ్లు. కమలాసింగ్ చేసే బ్యాలెట్ డ్యాన్స్ చూస్తే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రిక్షావాలా కొడుకు లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన బ్యాలెట్ స్కూల్లో ప్రవేశం సంపాదించారు. అది కూడా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కాలంలో.. అందరూ లాక్డౌన్లో ఉంటే తను మాత్రం అన్‌లాక్ అయ్యారు. తన భవిష్యత్తు కోసం కలలు కంటున్నాడు. ఆ కలలు సాకారం చేసుకోవడానికి అతను పడే కష్టాన్ని మహింద్రసింగ్ ట్విట్లో ప్రశంసించారు. లండన్‌లోని బ్యాలెట్ స్కూల్ ఫీజు ఎనిమిదివేల పౌండ్లు, అతని సంవత్సరంపాటు కోర్సు ఉంటుంది. కేవలం ఫీజు మాత్రమే కాదు.. మిగతా ఖర్చులు కూడా వుంటాయి. వీటన్నింటికి డబ్బులెలా వచ్చాయి అనుకుంటున్నారా? కేవలం 14 రోజుల్లో నిధుల సేకరణ వేదిక కెట్టో నుండి 20,000 పౌండ్లను సేకరించారు. కమలాసింగ్కి మునుపెన్నడూ బ్యాలెట్ స్కూల్ గురించి తెలియదని చెప్పారు. 'ఎనీబడీ కెన్ డ్యాన్స్ (ఎబిసిడి)' సినిమాతో కమలాసింగ్ నృత్యంపై ఆసక్తిని పెంచుకున్నాడు. బ్రిటన్ వార్తాపత్రికలో ఇంగ్లీష్ నేషనల్ బ్యాల్‌ట్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారని వార్తలు ప్రచురించాయి. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత కమలాసింగ్ అందులోనే ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా చేరే అవకాశం ఉందట. మహీంద్రా సింగ్ పోస్ట్ చేసిన ఈ పోస్టుకు అరగంటలోనే పన్నెండువేల లైక్ చేశారు.
0 comments:
Post a comment