School inspection withholding-soaking for private owners
పాఠశాలల తనిఖీ నిలుపుదల-ప్రైవేటు యాజమాన్యాలకు ఊరట
🌻ఈనాడు-గుంటూరు: పాఠశాలల తనిఖీలు తాత్కాలికంగా నిలుపుదల చేసేలా విద్యాశాఖ యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. ఈనెల 5 నుంచి 17 దాకా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో నెలకొన్న వసతులు, సౌకర్యాలు, బోధనా, బోధనేతర సిబ్బంది ఎంత మంది ఉన్నారు, పాఠశాల నిర్వహణకు సంబంధించిన దస్త్రాల నిర్వహణ ఎలా ఉందో క్షేత్రస్థా.యిలో తనిఖీలు చేసి పాఠశాలల వారీగా నివేదికలు తయారు చేయాలని పాఠశాల విద్య, నియంత్రణ పర్యవేక్షణ సంస్థ ఆదేశించింది. దీంతో జిల్లా విద్యాశాఖ కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పటికే పరిశీలనకు బృందాలను పంపింది. వారి పరిశీలన పూర్తికాకుండానే తాజాగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నుంచి తిరిగి సమాచారమిచ్చేవరకు తనిఖీలకు వెళ్లవద్దని ఆదేశించినట్లు జిల్లా విద్యాశాఖవర్గాలు తెలిపాయి. ఈపరిణామం ప్రైవేటు పాఠశాలలకు ఊరటనిచ్చింది. ఇప్పటికే వారు పాఠశాలలుమూసి ఉన్న సమయంలో తనిఖీలు సరికాదని అవసరమైన సమాచారమివ్వటానికి తమ వద్ద సిబ్బంది కూడా అందుబాటులో లేరని ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ నేతలు యంత్రాంగాన్ని కలిసి విన్నవించుకున్నారు. అవేం పట్టించుకోకుండా తనిఖీలకు ఉపక్రమిరచారు. దీనిపై విశాఖకు చెందిన ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడొకరు న్యాయస్థానంలో రిట్పిటీషన్ వేయటంతో కోర్టు ఆరు వారాలపాటు ఎలాంటి తనిఖీలు చేపట్టరాదని ఆదేశించింది. ఏడు మాసాల నుంచి పాఠశాలలు తెరవటం లేదని చాలా వరకు దుమ్ముధూళి కొట్టుకుని నిర్వహణ కొరవడి ఉంటాయని ఇవన్నీ లోపాలుగా పరిగణించి విద్యాశాఖ యంత్రాంగం తమపై చర్యలు తీసుకుంటుందని రిట్పిటిషన్లో పేర్కొన్నామని, అందుకే కోర్టు స్టే ఇచ్చిందని జిల్లాకు చెందిన అసోసియేషన్ నాయకుడొకరు చెప్పారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని ‘ఈనాడు’తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా సంస్థల్లో తనిఖీలను సోమవారం నుంచి నిలుపుదల చేస్తున్నామని తెలిపారు.
0 comments:
Post a comment