Rs.100coin Released by Prime Minister Modi
రూ. 100 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ
రాజమాత విజయరాజే సింధియా శత జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ సోమవారం రూ. 100 నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో లింక్ ద్వారా మాట్లాడిన ఆయన..రాజమాత జీవితాన్ని గురించి ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.రాజప్రాసాదాల్లో ఉన్నప్పటికీ ఆమె సామాన్య ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తూ వచ్చారని మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు జనసంఘ్ నాయకురాలిగా, బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలిగా రాజమాత విజయరాజే సింధియా పార్టీకి ఎనలేని సేవలందించారని ఆయన చెప్పారు. ఆమె గౌరవార్థం ఈ కొత్త రూ. 100 నాణేన్ని విడుదల చేయడం తనకు దక్కిన అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
0 comments:
Post a comment