వైర్ లెస్ ఇయర్ ఫోన్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?, మంచి కంపెనీ, క్వాలిటీతో పాటు తక్కువ ధర ఉన్న వాటిని కొనేందుకు వెతుకుతున్నారా? అయితే మీకు ఇది శభవార్తే. స్మార్ట్ ఫోన్ల తయారీ, అమ్మకాల్లో సంచలనం సృష్టించిన షియోమీ సంస్థ రెండు వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సోనిక్ బేస్ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్, రెడ్ మీ ఇయర్ బడ్స్ 2C బుధవారం మార్కెట్లోకి విడుదలయ్యాయి. సోనిక్ బేస్ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ బ్లాక్, బ్లూ కలర్ లో అందుబాటులో ఉన్నాయి. దీని పరిచయ ధర రూ. 999గా నిర్ణయించారు. అయితే ఈ ప్రారంభ ఆఫర్ తర్వాత దీని ధర రూ. 1,299గా ఉంటుంది. రెడ్ మీ ఇయర్ బడ్స్ 2C ప్రస్తుతం ఆఫర్ కింద రూ.1,299కి లభిస్తోంది. అయితే ఈ పరిచయ ఆఫర్ తర్వార దీని ధర రూ.1, 499 గా ఉంటుంది.
ఆడియో విభాగంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వారికి సాంకేతికతను అందించడానికి తమ ఇయర్ ఫోన్స్ మార్కెట్లోకి రావడం దోహదపడుతుందని రెడ్ మీ ఇండియా లీడ్ స్నేహ తైన్వాలా అన్నారు. రెడ్ మీ సోనిక్ బేస్ ఇయర్ ఫోన్స్ లో రెండు మైకులు ఉంటాయి. ప్రత్యేక టెక్నాలజీ ద్వారా ఈ ఇయర్ ఫోన్స్ తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అవుతల వ్యక్తికి మన మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. రెడ్ మీ ఇయర్ బడ్స్ 2C లోనూ అవతలి వ్యక్తికి మన మాటలు స్పష్టంగా వినిపించేలా సాంకేతికతను అభివృద్ధి చేయబడింది. మన చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్ధాలను ఇది నిరోధిస్తుంది. వీటి బ్యాటరీ సామర్థ్యం 12 గంటలు. అంటే ఒక సారి మనం ఫుల్ గా చార్జింగ్ చేస్తే పన్నెండు గంటల పాటు మ్యూజిక్ ను ఎంజాయ్ చేయవచ్చు.
0 comments:
Post a comment