కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమంది అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను, నాణేలను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు. ఇప్పుడు అలాంటి పాత నాణేనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (One Rupee Coin Help You Earn Lakhs)
దేశంలో అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ ఇండియామార్ట్ పురాతన నాణేలను వేలం వేస్తుంటుంది. ఒకవేళ మీ దగ్గర అలాంటి పురాతన నాణెం ఉంటే దాన్ని వేలంలో పెట్టి లక్షలు గెలుపొందవచ్చు. మీ దగ్గర 1913వ సంవత్సరం నాటి రూపాయి నాణెం ఉంటే, దాన్ని సుమారుగా రూ. 25 లక్షల వరకు వేలం వేయవచ్చు.
విక్టోరియా శకంలో వెండితో తయారు చేసిన ఈ నాణెం ధరను రూ. 25 లక్షలుగా నిర్ణయించారు. అలాగే 18వ శతాబ్దపు నాణెం ధరను ఇండియామార్ట్ రూ. 10 లక్షలుగా నిర్ణయించింది. 1818లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ అరుదైన నాణేన్ని తయారు చేసింది. ఈ పురాతన నాణెం మీద హనుమంతుడి బొమ్మ చెక్కబడి ఉంటుంది.
మీ దగ్గర ఉన్న అరుదైన, పురాతన నాణేలను విక్రయించాలనుకుంటే, మీరు ముందుగా ఇండియామార్ట్ అఫీషియల్ వెబ్సైట్ indiamart.comకు వెళ్లి.. మీ ప్రొఫైల్ను క్రియేట్ చేసుకోవాలి. వెబ్సైట్లో విక్రయదారుడిగా మీ పేరును నమోదు చేసుకోవాలి. ఇక రిజిస్ట్రేషన్ తరువాత, మీరు మీ పురాతన నాణేల పిక్చర్స్ను అప్లోడ్ చేసి.. వాటిని సేల్లో పెట్టొచ్చు. పురాతన నాణేలపై ఆసక్తి చూపేవారు ఖచ్చితంగా ఈ అవకాశం కోసమే చూస్తుంటారు. వారు ఆ అరుదైన నాణేలను సొంతం చేసుకునేందుకు పెద్ద మొత్తాన్ని కూడా చెల్లించేందుకు వెనుకాడరు.
0 comments:
Post a comment