నిరుద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ శుభవార్త చెప్పింది. పలు నియామకాలను చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ, గ్రేడీ సీ అధికారుల నియామకం కోసం ప్రకటన విడుదల చేసింది. ఇందు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు వారి విద్యార్హతలకు అనుగుణంగా అందుకు సంబంధించిన పోస్టులకు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు: ప్రివెంటింగ్ ఇంజినీర్ (Drilling)- 3 పోస్టులు, మేనేజర్(Accounts)/మేనేజర్(Internal Audit)-1, సూపర్ వైజింగ్ మెడికల్ ఆఫీసర్(ENT)-1, సూపర్ వైజింగ్ మెడికల్ ఆఫీసర్(Pathology)-1, సూపర్ వైజింగ్ మెడికల్ ఆఫీసర్((Eye Disease)-1, సూపర్ వైజింగ్ మెడికల్ ఆఫీసర్(Orthopedic Surgeon)-1, సూపర్ వైజింగ్ మెడికల్ ఆఫీసర్(Radiology)-1, సూపర్ వైజింగ్ మెడికల్ ఆఫీసర్(Physician)-1, సీనియర్ మెడికల్ ఆఫీసర్-3 పోస్టులు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్-2, సీనియర్ ఆఫీసర్(Electrical)-5 పోస్టులు, సీనియర్ ఆఫీసర్(HR)-2, సీనియర్ ఆఫీసర్(Legal)-2, సీనియర్ ఆఫీసర్ (Mechanical)-18, సీనియర్ ఆఫీసర్(Instrumentation)-4, సీనియర్ ఆఫీసర్(Geophysics)-5, సీనియర్ ఆఫీసర్(Reservoir)-1, ఫిజియోథెరపిస్ట్-1 తదితర 86 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. వివిధ పోస్టుల ఆధారంగా వాటి దరఖాస్తుకు వయస్సు, వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థఉలు నేరుగా https://register.cbtexams.in/OIL/Registration ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫారంను జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. ఏదైనా పొరపాటుగా నింపితే దరఖాస్తును రద్దు చేసే ప్రమాదం ఉంది.
0 comments:
Post a comment