Good news .. Recovery cases approaching 7 lakhs in AP ..
Coronavirus Positive Cases: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 73,625 శాంపిల్స్‌ను పరీక్షించగా 5,653 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,50,517కి చేరింది. ఇందులో 46,624 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,97,699 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 35 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,194కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 64.94 లక్షల కరోనా టెస్టులు జరిగాయి. ఇక నిన్న 6,659 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటిదాకా మొత్తం కేసుల్లో సుమారు 93 శాతం మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి..
అనంతపురం 351, చిత్తూరు 706, తూర్పుగోదావరి 706, గుంటూరు 470, కడప 504, కృష్ణా 468, కర్నూలు 119, నెల్లూరు 322, ప్రకాశం 538, శ్రీకాకుళం 163, విశాఖపట్నం 289, విజయనగరం 194, పశ్చిమ గోదావరి 823 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,342కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 701 మంది కరోనాతో మరణించారు.
0 comments:
Post a comment