Good news for home loan borrowers .. RBI key decision.!
హోమ్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక నిర్ణయం.!
Home Loan Interest Rates: సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా.? అయితే మీకోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. హోం లోన్ తీసుకుని సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్ అందించింది. రూ. 30 లక్షలు ఆపైన గృహా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. మరీ ముఖ్యంగా రూ. 75 లక్షలు పైగా హోం లోన్ తీసుకునేవారికి ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ తీసుకోనున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణగ్రహీతలకు సులభంగా రుణాలు అందించడానికి వీలుంటుంది.
ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు లోన్ మొత్తంపై ఆధారపడి ఉంటాయి. రూ. 30 లక్షలు వరకు వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి.
ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 30 లక్షల వరకు హోం లోన్స్‌పై 7% వడ్డీని, రూ. 30 నుంచి రూ. 75 లక్షలు వరకు 7.25% వడ్డీని.. అలాగే రూ. 75 లక్షలు పైన 7.35% వడ్డీని వసూలు చేస్తోంది. ఇకపోతే మహిళా రుణగ్రహీతలకు చాలా బ్యాంకులు 5 బేసిస్ పాయింట్లు తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి.
కాగా, వడ్డీ రేట్ల పెరుగుదల అనేది రుణం మొత్తంతో ముడిపడి ఉంటుంది. అలాగే క్యాపిటల్ అమౌంట్ రిక్వైర్మెంట్స్ లోన్-టు-వాల్యూ (ఎల్టివి)పై ఆధారపడి ఉంటాయి. ఇక తాజాగా ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో కొన్ని మార్పులు చేసింది, 2022 మార్చి వరకు మూలధన అవసరం ఎల్టివిపై మాత్రమే ఆధారపడి ఉంటుందని తెలిపింది.
0 comments:
Post a comment