ప్రపంచంలో అందరి స్మార్ట్ ఫోన్లలో భాగమై ఉంది గూగుల్. ఎందుకంటే ఏది కావాలన్నా ఇందులోనే చెక్ చేసుకోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త వర్షన్లు, అనువర్తనాలను విడుదల చేస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటోందీ సంస్థ. తాజాగా జీ-మెయిల్ గో యాప్ ను ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రారంభంలో కేవలం ఆండ్రాయిడ్ గో ఆధారంగా గో ఉన్నవారికే గో సూట్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశమిచ్చింది. ఆండ్రాయిడ్ గో అంటే లైట్ వెట్ తో ఉండి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేకంగా రూపొందించి లైట్ రిసోర్స్ వర్షన్. ఈ నేపథ్యంలో జీ-మెయిల్ గో అన్ని బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది.
ఇప్పటికే గూగుల్ సంస్థ తన గో యాప్స్ అయిన గూగుల్ గో, గ్యాలరీ గో, గూగుల్ మ్యాప్స్ గో ఆండ్రాయిడ్ యూజర్లందరూ వినియోగించుకునే అవకాశమిచ్చింది.
0 comments:
Post a comment