Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 15 October 2020

Flipkart SBI offer: ఎస్‌బీఐ కార్డు ఉందా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్ ఎంత వస్తుందంటే

 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందడి మొదలైంది. ఈసారి కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది ఫ్లిప్‌కార్ట్. అయితే ఈ డిస్కౌంట్ ఎంతవరకు వస్తుందన్న సందేహం కస్టమర్లలో ఉంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌లో పూర్తి వివరాలున్నాయి. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. క్రెడిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అక్టోబర్ 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 21 రాత్రి 11.59 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇక ప్లస్ మెంబర్‌షిప్ లేని కస్టమర్లకు ఈ ఆఫర్ అక్టోబర్ 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి అక్టోబర్ 21 రాత్రి 11.59 గంటల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తే ఆఫర్ వర్తించదు.

ఇక ఎంతవరకు డిస్కౌంట్ లభిస్తుందన్న విషయాన్నీ వెల్లడించింది ఫ్లిప్‌కార్ట్. గ్రాసరీ కాకుండా ఇతర ఏ ప్రొడక్ట్స్ కొన్నా కనీసం రూ.5,000 బిల్లింగ్ చేయాలి. అప్పుడే 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. గ్రాసరీ అయితే కనీసం రూ.1,500 బిల్ చేయాలి. ప్లస్ మెంబర్స్ అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో ఇతర కస్టమర్లు 16, 17 తేదీల్లో ఒక క్రెడిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,750 వరకు, ఒక డెబిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక 18 నుంచి 21 వరకు ఒక క్రెడిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,500 వరకు, ఒక డెబిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇది కాకుండా రూ.30,000 కన్నా ఎక్కువ సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తే గరిష్టంగా రూ.1,250 డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది. సింగిల్ ట్రాన్సాక్షన్ రూ.1,00,000 కన్నా ఎక్కువ చేస్తే అదనంగా రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ట్రావెల్ కేటగిరీలో డిస్కౌంట్ పొందాలనుకునేవారు FLYBBD కూపన్ కోడ్ ఉపయోగించాలి. కొన్ని ప్రొడక్ట్స్‌కి డిస్కౌంట్ ఆఫర్ వర్తించదు. ఆ వివరాలను https://www.flipkart.com/pages/sbi-bbd-tnc వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.


ఇక ఫ్లిప్‌కార్ట్ ఈసారి పేటీఎంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. పేటీఎం ద్వారా యూపీఐ, వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్‌పై క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్, ఇతర బ్యాంకుల డెబిట్ కార్డులతో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

1 comment:

  1. http://flipkart-cashback-offers-today.blogspot.com/?m=


    Hi, nice post great offers here. Great information Thank you so much.

    Hi,Very interesting post.this is my first time visit here. I found so many interesting stuff in your blog especially its discussion..thanks for the post!Flipkart SBI Offer

    Flipkart HDFC OfferHi, very good article thanks for sharing keep up the good work!


    Hello

    Such a great and informative article.

    Thanks for sharing


    Nice post. You covered a lot of points in your post . Thanks For sharing this with us.
    Flipkart SBI Offer

    I have read your article, it is very informative and helpful for me.I admire the valuable information you offer in your articles. Thanks for posting it.

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top