క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. క్రెడిట్ కార్డు వినియోగం సులభంగా ఉండటంతో పాటు సులభంగా బిల్ పేమెంట్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి అనేక థర్డ్ పార్టీ యాప్స్. క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడానికి ఆయా యాప్స్ రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. అయితే, థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మీ క్రెడిట్ కార్డు వివరాలను ఆయా యాప్స్‌లో పొందుపర్చడం ద్వారా మీ డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. అందువల్ల థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే చెల్లింపులు సురక్షతమా? కాదా? అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
CRED అనే యాప్‌లో మీ క్రెడిట్ కార్డు వివరాలను సేవ్ చేసుకోవచ్చు. అంతేకాక దీనిలో మీ క్రెడిట్ స్కోరును కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు బిల్లులను నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) మరియు యాప్‌లోని ఆటో పే ఫీచర్ ద్వారా సులభంగా చెల్లించవచ్చు. అయితే, 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కలిగి ఉన్న క్రెడిట్ కార్డు వినియోగదారులను మాత్రమే CRED కమ్యూనిటీలో చేరడానికి మరియు చెల్లింపులు జరపడానికి అనుమతి లభిస్తుంది.
ఒకవేళ CRED యొక్క కనీస క్రెడిట్ స్కోరు ప్రమాణాలకు అనుగుణంగా మీ క్రెడిట్ స్కోరు లేనిచో మీ కార్డును వెయిటింగ్ లిస్ట్‌లో చేర్చుతారు. అంతేకాక, మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపరచుకోవడంపై సలహా ఇస్తారు. ఈ యాప్‌ను ఉపయోగించి క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపులు చేసినప్పుడు, మీకు CRED నాణేలు రివార్డ్ చేయబడతాయి. బిల్లుల్లో చెల్లించిన ప్రతి రూపాయికి మీరు ఒక నాణెం రివార్డుగా లభిస్తుంది. క్రెడ్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్న వివిధ రివార్డులను సేకరించడానికి ఈ నాణేలను ఉపయోగించవచ్చు. యాప్‌లో వారి వస్తువులు మరియు సేవలను ప్రోత్సహించే పార్టనర్ మర్చెంట్లు నుండి షాపింగ్ చేసేటప్పుడు ఈ రివార్డులను ఉపయోగించి డిస్కౌంట్లు పొందవచ్చు.
పేటిఎం యాప్ ద్వారా
పేటిఎం యాప్‌ను ఉపయోగించి రూ .2,500 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపులు చేయవచ్చు. దీనికి గాను1000 పేటీయం ఫస్ట్ పాయింట్స్లను అందిస్తుంది. ఈ పాయింట్లను పార్టనర్ మర్చంట్స్‌తో రీడీమ్ చేయవచ్చు. పేటీయం యాప్ ద్వారా బిల్ చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డ్ వివరాలను సేవ్ చేసుకోవచ్చు. అయితే, ఫోన్‌ఫే యాప్'లో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు చేయడానికి మాత్రం మీరు ఇతర యాప్స్ మాదిరిగా క్రెడిట్ కార్డ్ వివరాలను సేవ్ చేయనవసరం లేదు. వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ మరియు రూపే ద్వారా బిల్ పేమెంట్ చేయవచ్చు. క్రెడ్ మాదిరిగా దీని ద్వారా బిల్ చెల్లించడానికి మినిమం క్రెడిట్ స్కోర్ ఉండాలనే నిబంధనేమీ లేదు. అయితే మీరు చెల్లించే క్రెడిట్ బిల్ ఆధారంగా రివార్డులు మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఈ యాప్ అందిస్తుంది.
ఈ యాప్స్‌లో మీ క్రెడిట్ కార్డ్ వివరాలు సేవ్ చేయబడతాయి. అందువల్ల మీ డేటా ప్రైవసీపై ఆందోళన ఉంటుంది. ఉదాహరణకు, మీ స్పెండింగ్ బిహేవియర్‌ను, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లను విశ్లేషించడానికి మీ ఈ-మెయిల్ సందేశాలను వీక్షించడానికి మీ ఈ-మెయిల్ ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రారంభంలోనే CRED మిమ్మల్ని అనుమతి కోరుతుంది. దీని వల్ల మీ బ్యాంక్ డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. దీనిపై రూపీటిప్ వ్యవస్థాపకుడు ఆదర్ష్ థాంపి మాట్లాడుతూ, 'మీ బ్యాంక్ ఖాతాతో ముడిపడి ఉన్న మీ ఈ-మెయిల్ ఇన్‌బాక్స్‌కు యాక్సెస్ చేయడానికి హ్యాకర్లు ప్రయత్నించవచ్చు. తద్వారా మీ డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.' అని పేర్కొన్నారు. తద్వారా హ్యాకర్లు మీ పాస్వర్డ్ రీసెట్ కోసం అభ్యర్థించవచ్చు లేదా బ్యాంకు ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను మార్చడం వంటివి చేయొచ్చు.
చాలామంది ప్రారంభంలో ఆయా యాప్స్‌కు ఇచ్చే పర్మిషన్ ద్వారా మీ అన్ని ఈ-మెయిల్స్‌ను యాక్సెస్ చేయడానికి వారికి అవకాశం కలుగుతుంది. దీనిపై సోషల్ మీడియాలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయని ఇన్ సహ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ రామలింగం తెలిపారు. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే క్రమంలో మీ డేటా చోరీకి గురౌతుందనే అనుమానం వస్తే సాంప్రదాయ పద్ధతుల ద్వారా అనగా నెట్-బ్యాంకింగ్, నిఫ్ట్, ఆటో-పే ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడం శ్రేయస్కరం.
0 comments:
Post a comment