Corona virus on currency notes for 28 days .. Scientists warn
కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు కరోనా వైరస్.. శాస్త్రవేత్తల హెచ్చరిక
Coronavirus currency notes: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు మరో షాకింగ్ న్యూస్ తెలిపారు. వేసవిలో ఈ వైరస్‌ని నియంత్రించకపోతే శీతాకాలంలో మరింత ముదిరే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. దీని వలన వాతావరణంలో వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉంటుందని, రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. చల్లటి వాతావరణంలో వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో కరెన్సీ నోట్లు, మృదువైన గాజు పరికరాలు, మొబైల్ టచ్ స్క్రీన్‌పై 28 రోజుల పాటు వైరస్ నిలిచి ఉంటుందని, ఇది చాలా ప్రమాదకరమని అందులో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు.
కరెన్సీ ఒకరి చేత నుంచి మరొకరికి మారే కొద్ది వైరస్ ప్రభావం పొంచి ఉన్నట్లేనని వారు అంటున్నారు. వేసవిలో సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే శీతాకాలం వాతావరణంలో కరోనా వైరస్ ఐదు రెట్లు బలంగా ఉంటుందని ఈ అధ్యయనంకు నాయకత్వం వహించిన వైరాలజిస్ట్ జుర్జెన్ రిచ్ట్ తెలియజేశారు. అందుకే శీతాకాలంలో కరోనా పరిస్థితిని కట్టడి చేయడం అతిపెద్ద సవాలు అని తెలిపారు. 40 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని ఉపరితలాలపై వైరస్ ఒక రోజు కూడా జీవించలేదని, కానీ వాతావరణం చల్లబడినప్పుడు ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
0 comments:
Post a comment