ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది... అయితే, గతంతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య మాత్రం భారీగా తగ్గింది... కానీ, ఓరోజు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి కరోనా పాజిటివ్ కేసులు.. దీంతో... కోవిడ్ వైరస్ వ్యాప్తి నివారణకు పటిష్ట చర్యలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం.. కోవిడ్ వ్యాప్తిని అరికట్టే విషయంలో గ్రామ వలంటీర్లకు కీలక బాధ్యతలు అప్పగించింది సర్కార్.. ప్రతి నెల ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. కోవిడ్ వైరస్‌పై అవగాహన కల్పించడంతోపాటు.. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే చేయనున్నారు వాలంటీర్లు. ప్రతి నెలా 5వ తేదీలోగా నివేదికలు సిద్ధం చేయాలని వాలంటీర్లకు సూచించారు అధికారులు..
స్మార్ట్ ఫోన్ వినియోగదారులంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవడంతో పాటు.. నో మాస్క్-నో ఎంట్రీ రూల్‌ను కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.. నో మాస్క్-నో ఎంట్రీ, శానిటైజేషన్, సామాజిక దూరం పాటించడం వంటి అంశాలపై ప్రతి వారం నివేదికలు ఇవ్వాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్.
👌Also Read.. చాలా సులభం గా తెలుగులో మెసేజ్ టైపు చేయుటకు ఒక మంచి యాప్...... English లో టైప్ చేసినచో తెలుగు లోకి మార్చుతుంది..డౌన్లోడ్ చేసి ఉపయోగించండి....
0 comments:
Post a comment