⭕ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ ఏదీ?
𒊹︎︎︎ తరచూ వాయిదాలతో ప్రక్రియపై సందిగ్ధం
𒊹︎︎︎ 8 నుంచి నిరాహార దీక్షలకు ఫ్యాప్టో పిలుపు
➪ ముదినేపల్లి, న్యూస్టుడే
✰ ఇంతవరకూ బదిలీల షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఈ ఏడాదైనా జరుగుతాయా అనే సందిగ్ధంలో ఉపాధ్యాయులు మునిగిపోయారు.
✰ నవంబరు నుంచి పాఠశాలలు పునః ప్రారంభానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది.
✰ మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నవారు ఈ వాయిదాల పర్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
✰ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక అయిన ఫ్యాప్టో దీనిపై నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది.
✰ 2017లో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి.
✰ మూడేళ్ల విరామం అనంతరం గత విద్యాసంవత్సరంలో ఈ ప్రక్రియ చేపట్టాలని సంఘాలు కోరాయి.
✰ వేసవి సెలవుల్లో జరుపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
✰ కొవిడ్-19 ప్రభావంతో లాక్డౌన్ అమలుతో సెలవుల్లో సాధ్యం కాలేదు.
✰ అన్లాక్ ప్రారంభమైన తర్వాత ఆగస్టులో బదిలీలు పూర్తిచేస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు.
✰ ఆ తర్వాత కూడా సెప్టెంబరు నెలాఖరు అని, ప్రస్తుతం ఈ నెలలో బదిలీలు పూర్తి చేస్తామని చెబుతున్నారు.
✰ పదేపదే వాయిదాపడటం, ఇంతవరకూ మార్గదర్శకాలు విడుదల కానందున అసలు బదిలీలు ఉంటాయా, లేదా అనే మీమాంసలో ఉపాధ్యాయులు పడిపోయారు.
✰ బదిలీల షెడ్యూల్ విడుదల గురించి ఫ్యాప్టో ఆధ్వర్యంలో అనేక సార్లు వినతి పత్రాలు అందించినా.. ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఈనెల 8 నుంచి 17 వరకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ధర్నాచౌక్లో నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించింది.
✰ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రోజూ ఐదు మండలాల ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.
హామీ అమలయ్యేనా?
✰ ప్రభుత్వం 0-60 వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని తెలపటంతో, గతంలో మిగులు పోస్టులు ప్రస్తుత హేతుబద్ధీకరణలో సరిపోనున్నాయి.
✰ విద్యాశాఖతో జరిగిన చర్చల్లో 40 మందికి పైగా విద్యార్థులుంటే మూడో పోస్టును మంజూరు చేయటం లేదా అప్పటికే ఉంటే నిలిపివేయడం లేదా అకడమిక్ ఇన్స్ట్రక్టర్ని నియమిస్తామని తెలిపిన హామీ ఎంత వరకు అమలవుతుందో వేచి చూడాలి.
➪ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలి
✰ మూడేళ్లుగా బదిలీల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం.
✰ త్వరితగతిన షెడ్యూల్ విడుదల చేస్తేనే పాఠశాలలు తెరిచేలోపు బదిలీలు పూర్తవుతాయి.
✰ ఇప్పుడు కాకపోతే మళ్లీ ఏడాది పాటు బదిలీలు జరిగే అవకాశం ఉండదు. - కేఎస్ఎస్ కుమార్, ఉపాధ్యాయుడు

0 comments:
Post a comment