New guidelines on postal ballot
Released Electoral Commission
🔊పోస్టల్ బ్యాలెట్‌పై కొత్త మార్గదర్శకాలు
📮విడుదల చేసిన ఎన్నికల సంఘం
దిల్లీ: 🗳️పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని మరింత సౌకర్యవంతం చేసే దిశగా ఎన్నికల సంఘం(ఈసీ) కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మరో 56 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈసీ వీటిని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు పంపింది. వీటి ప్రకారం 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఐచ్ఛికాన్ని ఎంచుకోవడానికి అవసరమైన పత్రాలను వారి ఇళ్లకే సంబంధిత బూత్ స్థాయి అధికారి(బీఎల్వో) పంపిస్తారు. వారిలో ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఎంచుకుంటే వారి ఇంటికి బీఎల్వో వచ్చి వారితో 12-డీ ఫాంలను నింపించాలి. నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల లోపు ఇది జరగాలి. ఆ తర్వాత ఆ పత్రాలను బీఎల్వో వెంటనే రిటర్నింగ్ అధికారి(ఆర్వో)కి సమర్పించాలి. తదుపరి ఆర్వో నియమించిన ఎన్నికల బృందాలు పోస్టల్ బ్యాలెట్ ఎంచుకున్న వారి ఇంటికి ముందే తెలిపిన తేదీల్లో బ్యాలెట్ బాక్స్‌ను తీసుకెళ్లి ఓటింగ్ నిర్వహించాలి. పారదర్శకత కోసం ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలి. ఆ తర్వాత ఆ బ్యాలెట్ బాక్సులను ఆర్వో వద్ద డిపాజిట్ చేయాలి. సర్వీస్ ఓటర్లకు అందించే పోస్టల్ బ్యాలెట్‌కు దీనికి సంబంధం లేదని, ఇందులో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కావాలనుకున్నవారే సంబంధిత పత్రాలు నింపాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు

0 comments:
Post a comment